Site icon NTV Telugu

Vaibhav Suryavanshi: ఒక్క సీజన్లో ఇన్ని రికార్డులా.. విధ్వంసానికి మొగుడిలా ఉన్నావే..

Vibhav

Vibhav

బీహార్‌ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. గతవేలంలో రాజస్థాన్ ఈ పద్నాలుగేళ్ల పిల్లాడిని కోటి రూపాయలకు దక్కించుకుంది. తొలి మ్యాచ్‌తోనే వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్ కొట్టి తన సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 34 పరుగులతో సత్తా చాటాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ గుజరాత్ టైటాన్స్‌పై నెలకొల్పాడు. 38 బంతుల్లో 101 పరుగులతో ఊచకోత కోశాడు. తరువాతి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. తాజాగా చెన్నైపై హాఫ్ సెంచరీ చేసి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాడు.

Also Read:Medical shops: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల ఆకస్మిక దాడులు..

వైభవ్ ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేసి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 2010లో 37 బంతుల్లో సెంచరీతో అగ్రస్థానంలో ఉన్న యూసుఫ్ పఠాన్‌ను వైభవ్ అధిగమించాడు. ఇంకా 20 ఏళ్ల వయసులోపు అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.ఈ సీజన్లో అతను మొత్తం 24 సిక్సర్లు కొట్టాడు. అత్యధిక స్ట్రైక్ రేట్ కూడా వైభవ్ పేరిటే ఉంది. 206 స్ట్రైక్ రేట్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

Also Read:Thug Life : ‘థగ్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన కమల్..!

ఐపీఎల్ అరంగేట్రంలో తొలి బంతికే సిక్స్ కొట్టాడు. ఇదొక మైలురాయి అనే చెప్పొచ్చు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కూడా నిలిచాడు. ఈ విషయంలో అతను 9 సిక్సర్లు కొట్టిన ఇషాన్ కిషన్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 ఇన్నింగ్స్‌లో కేవలం బౌండరీల ద్వారా 40 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. ఇలా ఒక్కసీజన్లోనే అసాధారణ రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుని టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంగా మారాడు. ఈ రికార్డులను బద్దలు కొట్టాలంటే మరో వైభవ్ దిగిరావాల్సిందేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version