Site icon NTV Telugu

Vaibhav Suryavanshi: సిక్సులతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 209 భారీ స్కోర్ ను సాధించించింది. ఇక 210 పరుగుల భారీ టార్గెట్ ను చేధించడానికి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ బౌలర్ల పై ఎటువంటి కనికరం చూపించకుండా ఆకాశమే హద్దుగా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

Read Also: Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. మొదటి ఆటగాడు!

ఈ నేపథ్యంలో కేవలం 17 బంతులలో తన మొదటి ఐపీఎల్ అర్ధ సెంచరీ నమోదు చేసుకోగా.. అదే జోరును కొనసాగిస్తూ సెంచరీని సాధించాడు. కరీం జానత్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఏకంగా 30 పరుగులను రాబట్టాడు వైభవ్ సూర్యవంశీ.. దీంతో కేవలం 35 బంతుల్లోనే ఐపిఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో క్లీన్ బోల్డ్ అయి వెనుతిరిగాడు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ 38 బంతులతో ఏడు ఫోర్లు, 11 సిక్సులతో 101 పరుగులు చేసి తన సత్తా చాటాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ 2025 లో ఫాస్టెస్ట్ సెంచరీని, అలాగే అతి పిన్న వయసులో సెంచరీ చేసిన వ్యక్తిగా వైభవ్ సూర్యవంశీ రికార్డ్ సృష్టించాడు.

Exit mobile version