Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకురండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున తన తొలి పూర్తి సీజన్ ఆడిన వైభవ్ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్ దూకుడు, నిలకడైన ప్రదర్శనలు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్ల ప్రశంసలను కూడా అందుకుంటున్నాయి.
వైభవ్ ప్రదర్శనపై తాజాగా ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ ఫిన్ స్పందించారు. అతడిని వీలైనంత త్వరగా భారత జట్టులోకి తీసుకురావాలని అభిప్రాయ వ్యక్తం చేశాడు. యూకే వేసవి సీజన్ లోనే భారత జెర్సీలో వైభవ్‌ను చూడాలని తనకు ఉందని ఫిన్ పేర్కొన్నాడు. “భారత్ ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ జట్టు. ఓపెనింగ్‌లో ఇప్పటికే అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లు ఉన్నారు. అందువల్ల ఎవరిని పక్కనబెట్టి వైభవ్‌కు అవకాశం ఇవ్వాలన్నది కఠిన నిర్ణయమే. అయితే అతడు జట్టులోకి వస్తే టీమిండియా మరింత బలపడుతుంది” అని ఫిన్ వ్యాఖ్యానించాడు.
Also Read
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
ఈ సీజన్‌కు ముందు వైభవ్ మరోసారి అదే స్థాయిలో నిలకడగా రాణించగలడా అనే సందేహాలు ఉన్నాయని ఫిన్ పేర్కొన్నాడు. అయితే వాటన్నింటికీ యువ బ్యాటర్ తన ఆటతో సమాధానం ఇచ్చాడని కొనియాడాడు. “ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ 700కు పైగా పరుగులు చేసి 236 స్ట్రైక్‌రేట్ నమోదు చేయడం అసాధారణ విషయం. అదీ కేవలం 15 ఏళ్ల వయసులో పూర్తి సీజన్ అంతా అదే దూకుడు కొనసాగించడం నమ్మశక్యం కాని విషయం. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో వైభవ్‌నే అతిపెద్ద కథనం” అని ఫిన్ ప్రశంసించాడు.
వైభవ్ ఆటలో యార్కర్ బంతులను ఎదుర్కోవడమే ఒక చిన్న బలహీనతగా కొందరు పేర్కొంటున్నారని ఫిన్ చెప్పాడు. అయితే కొత్త బంతితో కచ్చితమైన యార్కర్లు వేయడం బౌలర్లకే చాలా కష్టమని, అలాంటి చిన్న లోపం మాత్రమే ఉంటే దానిని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ కు గాను 5 కీలక అవార్డ్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు రూ.45 లక్షల రివార్డ్స్ ను కూడా గెలుచుకున్నాడు.
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!