Site icon NTV Telugu

V Hanumantha Rao: తొందర పడకండి.. హరీష్‌ రావ్‌ పై వీహెచ్ సీరియస్

V Hanumantha Rao

V Hanumantha Rao

V Hanumantha Rao: హరీష్ రావు తొందర పడుతున్నారు అంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. బీఆర్ఎస్ మూడు ఎకరాల.. డబుల్ బెడ్ రూమ్ ఇస్తాం అని చెప్పారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశావు? అని ప్రశ్నించారు. పదేళ్ళలో నువ్వు ఇచ్చిన హామీలు ఏం పూర్తి చేశావు? అని మండిపడ్డారు. మేము వచ్చి నెల రోజులు కాలేద.. మేము ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామని, తొందర పడకండని అన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామన్నారు. ఆరు గ్యారంటీలు అమలుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అండర్ 18 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ కి రావాలని కోరామని అన్నారు.

Read also: కారులో అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ఏఎస్సై.. 36 ఫుల్ బాటిల్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు!

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీ లు..బీఆర్ఎస్ ఫెయిల్యూర్ ని జనంలోకి రేవంత్ బాగా తీసుకెళ్లారని తెలిపారు. అన్ని హామీలు అమలు చేస్తాం.. ప్రజలు నమ్మండి అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలో ఎక్కువ సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు. ఏపీలో షర్మిల వస్తున్నారని, ఇక్కడ వద్దు.. అక్కడికి వెళ్ళు అని మొదటి నుండి చెప్పినామన్నారు. వైజాగ్ లో అమ్మాయి పై జరిగిన అఘాయిత్యం పై షర్మిల పోరాటం మొదలు పెట్టాలన్నారు. వైఎస్ కోరిక రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. ఆయన కోరిక కోసం షర్మిల పని చేయాలని తెలిపారు.
కారులో అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ఏఎస్సై.. 36 ఫుల్ బాటిల్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు!

Exit mobile version