Hanumantha Rao: రేణు దేశాయ్.. అమల లాంటి వాళ్ళు కుక్కలను చంపొద్దు అని అంటున్నారని.. మూగ జీవుల గురించి బాగానే మాట్లాడుతున్నారు.. భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు అన్నారు. ఒకప్పుడు భర్త కోసం సతిసావిత్రి యముడితో పోరాడింది.. నేడు భర్తలను భార్య.. భార్యలను భర్తలు చంపుకునేది పెరిగిందన్నారు. ఇలా చేస్తుకుంటూపోతే పిల్లల సంగతి ఏంటి..? అని ప్రశ్నించారు. తాజాగా బుధవారం మీడియాతో మాట్లాడిన వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలపై విద్యావంతులు.. మేధావులు ఆలోచించాలని సూచించారు. ఈ తరహా హత్యలను ఆపేందుకు ప్రయత్నం చేయాలన్నారు. మహిళా సంఘాలు కూడా సమావేశాలు పెట్టి ఆలోచించాలని సూచించారు.
READ MORE: Social Media Weight Loss Tip: విద్యార్థి ప్రాణం తీసిన సోషల్ మీడియా టిప్.. అసలేం జరిగిందంటే..!
ఇదిలా ఉండగా.. జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా గుర్తింపు పొందిన సినీ నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునే సవాల్ చేస్తూ, వీధి కుక్కల హత్యలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుక్కలను వ్యతిరేకిస్తూ వాటిని చంపాలని చూస్తున్న వారికి ‘పిచ్చి పట్టింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రేణు దేశాయ్ కఠినంగా స్పందించారు. “మొత్తం న్యాయం అనేది ఒక జోక్ అయిపోయింది. దానికి నేనే సాక్ష్యం” అంటూ ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ తీర్పు ఇచ్చిన జడ్జికి కుక్కల మీద ఏదైనా వ్యక్తిగత ద్వేషం ఉండి ఉండవచ్చని, ఇది మానవత్వంతో ఇచ్చిన తీర్పు కాదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై తాజాగా వీహెచ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Rimi Sen : భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు.. అందుకే దుబాయ్‌కు వెళ్ళిపోయానన్న రిమీ సేన్!