Sisters of PM Modi, CM Yogi meet at Uttarakhand Temple: ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరీమణులు ఉత్తరాఖండ్‌లో కలుసుకున్నారు. ప్రధాని మోదీ సోదరి వాసంతీ బెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి దేవిలు కొఠారీలోని ఓ దేవాలయం సమీపంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రావణ మాసం సందర్భంగా శివుని దర్శనం కోసం ప్రధాని నరేంద్ర మోదీ సోదరి వాసంతీ బెన్ తన భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌లోని నీలకంఠ్ ధామ్‌ను దర్శించుకున్నారు. అనంతరం వాసంతీ దంపతులు కొఠారిలోని ఓ దేవాలయంకు వెళ్లారు. అక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి దేవిని కలిశారు. దాంతో వాసంతీ, శశి దేవిలు హత్తుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరు కలిసి ఓ హోటల్ లోపలి వెళ్లి చాలా సమయం మాట్లాడుకున్నారు.
Also Read: OnePlus Nord CE 3 5G Price: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5G సేల్స్ ఆరంభం.. ధర, ఫీచర్ల వివరాలివే!
सीएम योगी की बहन शशि से मिलीं पीएम की बहन बसंती बेन
◆ दोनों ने जाना एक दूसरे का हाल चाल
Narendra Modi Sister | Yogi Adityanath | #Uttarakhand pic.twitter.com/Qynrnz6A0F
— News24 (@news24tvchannel) August 4, 2023