Uttarakhand : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ముస్లిం యువకుడు వేరే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో తిరుగడం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ముస్లిం యువకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. కొట్టడంతో పాటు ముస్లిం యువకుడికి జనం గుండు కొట్టించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
హరిద్వార్‌లోని హర్ కి పైడి సమీపంలోని ఘాట్‌పై ఒక యువకుడు, ఒక అమ్మాయి కూర్చున్నారు. ఇంతలో ఇతర వర్గాలకు చెందిన కొందరు యువకులు అక్కడికి చేరుకుని యువకులను విచారించడం ప్రారంభించారు. విచారణలో వారి అనుమానాలు నిజమని నిరూపించబడింది. యువకుడు ముస్లిం మతానికి చెందినవాడు. కాగా అతనితో ఉన్న అమ్మాయి వేరే మతానికి చెందినది. ఇది విని అక్కడ గుమిగూడిన జనం ఆగ్రహించి యువకుడిపై లవ్ జిహాద్ అంటూ తీవ్రంగా కొట్టారు.
Read Also:EV Charging Stations: చార్జ్‌జోన్‌తో ఎంజీ మోటార్ టై అప్.. పలు ప్రదేశాలలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు!
యువకుడిని కొట్టిన తర్వాత అక్కడ ఉన్న జనం అతనికి గుండు కొట్టించారు. అతనితో పాటు ఉన్న అమ్మాయి యువకుడిని రక్షించడానికి చాలా ప్రయత్నించింది, కానీ ఎవరూ ఆమె మాట వినలేదు. కొట్టి, గుండు గీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. దీని తర్వాత, విచారణ అనంతరం బాధ్యులపై కేసు నమోదు చేయాలని హరిద్వార్ ఎస్ఎస్పీ పరమేంద్ర దోవల్ ఆదేశించారు.
విచారణలో యువకుడు, యువతి గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ అని, కలిసి తిరుగుతూ హరిద్వార్‌కు వచ్చామని చెప్పారు. అబ్బాయిది కాశీపూర్, అమ్మాయి బిజ్నోర్. ప్రస్తుతం పోలీసులు ఈ విషయమై దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతమంది ముస్లిం కమ్యూనిటీ ప్రజలు హర్కి పైడి వద్దకు రాకుండా నిషేధించారని, అందుకే ఇక్కడ ప్రతిరోజూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు.
