Site icon NTV Telugu

Uttarakhand Floods: ఉధృతంగా పోటెత్తిన గంగమ్మ.. శివుని చెంతకు చేరిక!

Uttarakhand Floods

Uttarakhand Floods

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్ బ్రస్ట్ నేపథ్యంలో భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రభావంతో రిషికేశ్‌లోని పరమార్థ నికేతన్ ఆశ్రమం వద్ద గంగా నది ఉధృతంగా ప్రవహించి, అక్కడి హారతి స్థలంలో ఉన్న శివుడి విగ్రహం పాదాలను తాకింది. ప్రస్తుతం అన్ని ఘాట్లు మూసివేయగా, నదీ తీరం వద్ద ప్రజల ప్రవేశాన్ని అధికారులు అనుమతించడం లేదు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర అత్యవసర కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగించాలని ఆయన అధికారులకు సూచించారు.

Kartavya Bhavan 3 Inaugurate: కర్తవ్య భవన్-3ను ప్రారంభించిన ప్రధాని మోదీ..!

అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సీఎం ధామితో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. పునరావాస, రక్షణ చర్యల్లో అన్ని రంగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. అలాగే ఓ అధికార ప్రకటన ప్రకారం వరుస వర్షాలు, ప్రమాదకరమైన మార్గాలు సహాయక చర్యలకు అడ్డంగా మారుతున్నా ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించేందుకు అధికారులు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ భారీ వరదల దృష్ట్యా రిషికేశ్, ఉత్తరకాశీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

Raksha Bandhan 2025: రాఖీ కట్టేందుకు నియమాలు.. ఏ దిక్కున కూర్చోవాలి, ఎన్ని ముడులు శుభప్రదమో తెలుసా?

Exit mobile version