NTV Telugu Site icon

Patanjali: ఉత్తరాఖండ్‌లో 5 పతంజలి మందులపై నిషేధం.. ఎందుకో తెలుసా?

Patanjali

Patanjali

Patanjali: ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి దివ్యఫార్మసీకి ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది. ఐదు ఔషధాల తయారీని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బీపీ గ్రిట్, లిపిడామ్ వీటిల్లో ఉన్నాయి. తమ అనుమతులు పొందిన తర్వాతే వీటి తయారీని తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తమ ఐదు ఔషధాల ఉత్పత్తిని నిషేధించిందని నివేదికలు రావడంతో ఆయుర్వేద వ్యతిరేక డ్రగ్ మాఫియా కుట్ర పన్నిందని పతంజలి ఆరోపించింది. ఆర్డర్‌ కాపీ తమకు అందలేదని కంపెనీ పేర్కొంది.

Gujarat Polls: 46 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

రక్తపోటు, మధుమేహం, గాయిటర్, గ్లకోమా, అధిక కొలెస్ట్రాల్‌కు చికిత్సగా కంపెనీ ప్రచారం చేసిన ఐదు ఉత్పత్తుల తయారీని నిలిపివేయాలని ఉత్తరాఖండ్ అథారిటీ రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ను కోరినట్లు పలు వార్తాపత్రికల్లో గురువారం కథనాలు వచ్చాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి పతంజలి ఆయుర్వేద ఆరోగ్య ఉత్పత్తుల శ్రేణిలో ప్రమోట్ చేయబడిన మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బిపిగ్రిట్ మరియు లిపిడోమ్ ఉత్పత్తిని నిలిపివేయాలని తయారీదారు దివ్య ఫార్మసీని ఆదేశించినట్లు ది టెలిగ్రాఫ్ నివేదించింది. భవిష్యత్తులో ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలు తమ అనుమతి పొందిన తర్వాతే ఇవ్వాలని ఆంక్షలు విధించింది. ఉల్లంఘిస్తే ఔషధ తయారీ లైసెన్స్ ను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించింది. ఔషధ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా దివ్య ఫార్మసీ ప్రకటనలు ఇస్తున్నట్టు ఆరోపించింది.

Show comments