Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ దేశంలోనే తొలిసారి ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాలనను మరింత సాంకేతికతతో కూడిన, పారదర్శకంగా చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని భారతీయ సాంకేతిక సంస్థ (IIT) కాన్పూర్ ప్రొఫెసర్లు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతులు ఆగస్టులో జరగనున్న మాన్సూన్ సమావేశం మధ్యలో లేదా చివరిలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా AI శిక్షణా సెషన్లు నిర్వహించనున్నారు.
Vivo T4R 5G: అతిసన్నని క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో మంత్రముగ్ధులను చేయడానికి సిద్దమైన వివో T4R..!
భవిష్యత్‌లో అసెంబ్లీలో ప్రత్యేక AI కేంద్రాల ఏర్పాటును కూడా యూపీ అసెంబ్లీ కార్యాలయం భావిస్తోంది. ఇవి ఎమ్మెల్యేలకు చట్టపరమైన పరిశోధన, పత్రాల విశ్లేషణ విషయాలపై అధ్యయనంలో సాంకేతిక సాయం అందించనున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ఎమ్మెల్యేలు, వారి సిబ్బందికి AI టూల్స్ వినియోగంపై ప్రత్యేక వర్క్ షాపులు కూడా నిర్వహించనున్నారు. ఇది పాలనలో కొత్త దిశను తీసుక వస్తుందని ఆశిస్తున్నారు.
BAN vs SL: శ్రీలంక గడ్డపై చరిత్రను తిరగరాసిన బంగ్లా టైగర్లు.. తొలి టీ20 సిరీస్ గెలుపు..!
AI టెక్నాలజీ ద్వారా బిల్లుల డ్రాఫ్టింగ్, చట్టాల పూర్తి విశ్లేషణ, న్యాయపరమైన సమస్యల గుర్తింపు, అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల చట్టాలతో పోలిక వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. AI సామర్థ్యం ద్వారా సోషల్ మీడియా, సర్వేలు, పిటిషన్ల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చును. ఇది చట్టం సామాజిక, ఆర్థిక ప్రభావాలపై ముందస్తు అంచనా వేయడంలో సహకరిస్తుంది.
