తెలంగాణ ప్రజల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, కృష్ణా జలాల విషయమై ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వం అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల కేటాయింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ WP1230/2023 నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన నేపథ్యంలో మంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ వాదులతో కలిసి విచారణకు స్వయంగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోర్టు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసిందని, ఈ నెల 25వ తేదీ కల్లా అన్ని వాదనలపై షార్ట్ నోట్స్ సమర్పించాలన్నారని అన్నారు.
READ MORE: Off The Record: ఆ వైసీపీ నేత అజ్ఞాతం నుంచి బయటికొచ్చారా.. జగన్ బూస్ట్ ఇచ్చారా..?
కావున ఈ నెల 19-21వరకు జరగాల్సిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ యధాతధంగా ఉంటుందని ఆయన తెలిపారు. నేటి సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వం వాదనలకు మద్దతుగా నిలిచిందని, ఇది రాష్ట్ర హక్కులను రక్షించడంలో ముందడుగు అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నేటి విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్ (ప్రభుత్వ సలహాదారు), వైద్యనాథన్, గోపాల్ శంకర్ నారాయణ (న్యాయవాదులు), అంతర్రాష్ట్ర నీటి వనరుల విభాగం అధికారులు, ENC (O&M) హాజరయ్యారు.
READ MORE: Manchu Manoj: “చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదు”.. మనోజ్ సంచలన వ్యాఖ్యలు