Site icon NTV Telugu

Uttam Kumar Reddy : రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం

Uttamkumar Reddy

Uttamkumar Reddy

నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవడం ఖాయమన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

 

 

బీజేపీ తోనే మాకు పోటీ అని, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐటీఆర్ ని రద్దు చేసిందన్నారు. కేంద్రంలో 10 సంవత్సరాలు పాలించిన బీజేపీ తెలంగాణకు ఏమి చేయలేదని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ తప్పుడు విధానాలవల్ల రైతులు తీవ్ర గా నష్టపోయారని,కేంద్ర ప్రభుత్వం ఈడి ఐటీ దాడులు నిర్వహించి భయ బ్రాంతులకు గురిచేస్తుందన్నారు. తెలంగాణలో 13 నుంచి 14 స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పనైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. లోక్‌ సభ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

 

Exit mobile version