NTV Telugu Site icon

Uttam Kumar Reddy : అధికారులు అప్రమత్తంగా ఉండండి.. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లొద్దు

Uttam

Uttam

రాష్ట్రంలో భారీ నుండీ అతి భారీవర్షాలు కురుస్తున్నందున నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖాధికారులను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి యన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత ప్రభుత్వ వాతావరణ శాఖా రెడ్ ఏలెర్ట్ ప్రకటించిన నేపద్యంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఈ సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమతి లేకుండా ఇంజినీర్లు హెడ్ క్వార్టర్ ను విడిచి పోవద్దని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని ఆయన సూచించారు.

Home Minister Anitha: భారీ వర్షాలపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష

రెడ్ ఎలెర్ట్ ప్రకటించిన నేపద్యంలో ఎవ్వరూ సెలవులు పెట్టొద్దని ఆయన ఆదేశించారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, చెరువులను మానిటరింగ్ చేస్తుండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నీటి స్థాయిలను పర్యవేక్షించాలన్నారు. మరీ ముఖ్యంగా ఓవర్ ఫ్లో ను నిరోధించడానికి గేట్లు,స్పిల్ వేల పనితీరును క్షుణ్ణంగా పరిశీలంచాలన్నారు. ఎప్పటికప్పుడు డ్యామ్ లు కట్టలు,కెనాల్ లను తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రమాదం పొంచి ఉందన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతకు మించి రైల్వే ఎఫెక్టెడ్ చెరువుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.అత్యవసర పరిస్థితిలలో నీటిపారుదల శాఖా ఇంజినీర్లు వేగవంతంగా స్పందించాలన్నారు. విపత్తులు సంభవిస్తే స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలను అప్రమత్తం చెయ్యాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Radhika : చెప్పుతో కొడితే సరిపోతుందా? విశాల్‌పై రాధిక సంచలన వ్యాఖ్యలు!