NTV Telugu Site icon

Uttam Kumar Reddy : సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకెళ్తున్నాం…

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar Reddy : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కోర్ట్ ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. 2700 కోట్లతో రైతు రుణమాఫీ కి ఇవ్వడం జరిగిందని, 850కోట్లు రైతుల మీద వడ్డీ భారం పడిందన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. బీఆర్‌ఎస్ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేసి 1700 కోట్లు సొమ్ము చేసుకుందని, పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Aadi Srinivas : కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారు

అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కాకముందే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన ఉద్ఘాటించారు. 40 లక్షల మంది రైతులు 153 లక్ష మెట్రిక్ టన్ను పంట పండించారని, పొల్యూషన్ నివారణకు ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని, అత్యధిక పరిశ్రమలు నిర్మిస్తున్నామని, ఈనెల నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

Beauty Tips: పాలతో ఫేషియల్.. పార్లర్కు వెళ్లే పని ఉండదు..! ట్రై చేయండి