Uttam Kumar Reddy : ప్రాజెక్టులు , రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత పనులను తక్షణం ప్రారంభించాలని నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని సూచించారు. పూడికతీత పనుల్లో ఆలస్యం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ , ఆర్థిక వృద్ధి కోసం నీటిపారుదల ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయని, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
IPL 2025 Mega Auction: మెగా వేలంలో అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై కనక వర్షం..
సీతారామ ప్రాజెక్టు టెండర్ల పనులను వేగవంతం చేసి, ప్రాజెక్టు పనుల్లో అనుమతులు లేదా పరిపాలన సంబంధిత జాప్యాలు రాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మోడికుంట వాగు అంచనాలను రూపొందించడంతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూ సేకరణలో ఏర్పడే సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు రీలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కమిషనర్‌తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. భూ సేకరణకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 27న సింగూరు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా పాల్గొంటారని వివరించారు.
Ramdas Athawale: ఫడ్నవిస్ సీఎం అయ్యే ఛాన్స్.. కేంద్రమంత్రి వ్యాఖ్య
డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా, నల్గొండ జిల్లాకు చెందిన ప్రాజెక్టుల పురోగతి, నిధుల అవసరాలు, భూసేకరణలో ఎదురవుతున్న అడ్డంకులు వంటి అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖలో లష్కర్ నియామకంతో పాటు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.