Site icon NTV Telugu

Uttam Kumar Reddy : కిషన్‌ రెడ్డి కాంగ్రెస్‌పై బురద జల్లే ప్రయత్నం చేశారు

Uttamkumar Reddy

Uttamkumar Reddy

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆయన మాట్లాడిన మాటల్లో సత్యదూరం అయినవి ఉన్నవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కలిసి 3500 రోజులు గడిపారని, పదేళ్లు బీఆర్ఎస్, బీజేపీ అన్ని విషయాల్లో కలిసి పని చేసారన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నవని, కాళేశ్వరంకు బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు ఎలక్ట్రిసిటీ సెక్టార్ కు 1లక్షా 27వేల కోట్ల లోన్లు ఇచ్చిందని, మొదటి సారి పవర్ కార్పొరేషన్ ఫైనాన్స్ తన నిబంధనలు మార్చుకుని కాళేశ్వరంకు లోన్లు ఇచ్చారన్నారు.

 

రూరల్ ఎలక్టిఫికేషన్ కార్పొరేషన్ కూడా అంతర్గత రూల్స్ మార్చుకుని తెలంగాణ ఇరిగేషన్ శాఖకు 60 వేల కోట్లు ఇచ్చిందని, బీఆర్ఎస్, బీజేపీ కలిసి దోచుకుందామని లోన్లు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. 21 అక్టోబర్ నాడు మెడిగడ్డ ఐదు ఫీట్లు కోలాప్స్ అయినా మీరెందుకు విజిట్ చేయరు? అని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపలేదు. కేంద్ర మంత్రులు ప్రశ్నించలేదన్నారు మంత్రి ఉత్తమ్‌. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వారం రోజుల్లో న్యాయవిచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తప్పుచేసిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.

Exit mobile version