Site icon NTV Telugu

Uttam Kumar Reddy : అవసరం అయితే బార్డర్ కు వెళ్లి యుద్ధంలో పాల్గొంటా…

Uttam

Uttam

Uttam Kumar Reddy : పాకిస్థాన్ తో భారత్ యుద్ధ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దొంగ దాడులను ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కుందని ప్రశంసించారు. పూర్తి స్థాయి యుద్ధమే వస్తే.. అవసరం అయితే వెళ్లి బార్డర్ లో యుద్ధంలో పాల్గొంటానని సంచలన ప్రకటన చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మన ఇండియన్ ఆర్మీ సాహసాన్ని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. ‘పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అత్యంత ఘాతుకానికి ఒడిగట్టారు. టెర్రరిస్టులు నిరాయుధులైన వారిని కాల్చి చంపడం అమానవీయ చర్య. హిందూ, ముస్లింల మధ్య విభేదాలు పెంచడానికే ఇలాంటి పని చేశారు. దానికి ప్రతీకారంగా ఇండియా చేస్తున్న స్ట్రైక్ అద్భుతం’ అంటూ కొనియాడారు.

Read Also : Kangana Ranaut: హాలీవుడ్ సినిమాలో కంగనా

‘నేను మిలటరీలో పని చేశా. నాకు యుద్ధం గురించి అవగాహన ఉంది. రఫెల్, డ్రోన్ లను మొన్న ఆపరేషన సింధూర్ లో వాడారు. కామికజెన్ డ్రోన్ లను కూడా వాడారు. మన బార్డర్ లో ఉండి టార్గెట్ ను చేజ్ చేశారు. బార్డర్ ను కూడా క్రాస్ చేయలేదు. హ్యామర్ అనే బాంబులను ఇండియన్ ఆర్మీ ఉపయోగించింది. 100 కిమీ వరకు టార్గెట్ ను సక్సెస్ చేశారు. మన రఫెల్ ను కూల్చేశాం అని పాక్ చేస్తున్న ప్రచారం ఉత్తదే. మన ఇండియన్ ఆర్మీ బలం ఏంటో ప్రపంచం చూసింది. ఇలాంటి సమయంలో అందరూ ఆర్మీకి మద్దతుగా ఉండాలి. ఎలాంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేయబోం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం’ అంటూ ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

Read Also : Pawan Kalyan: వీరమల్లు డేట్ ఫిక్స్ చేసిన అమెజాన్.. త్వరలో అధికారిక ప్రకటన!

Exit mobile version