Site icon NTV Telugu

Regina Cassandra: ఎన్నో రిలేషన్‌షిప్స్ ఉన్నాయి.. నేను ఓ సీరియల్ డేటర్‌ను: రెజీనా

Regina Cassandra

Regina Cassandra

Regina Cassandra Said I Have A Many Relationships: 2022లో ‘శాకిని ఢాకిని’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న హీరోయిన్ రెజీనా కసాండ్రా.. అబ్బాయిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అబ్బాయిలు, మ్యాగీ.. 2 నిమిషాలలో అయిపోతాయి’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో రెజీనా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మరోసారి రెజీనా పేరు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈసారి తన గురించే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అర్జున్‌ సాయి దర్శకత్వంలో దిలీప్‌ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన సినిమా ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ నిర్మించిన ఈ సినిమా.. నేడు తెలుగు, కన్నడ, హిందీలో రిలీజ్ అవుతోంది. ఉత్సవం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రెజీనా.. తన రిలేషన్‌షిప్స్ గురించి చెప్పారు. మీకు చాలా ప్రపోసల్స్ వచ్చి ఉంటాయ్ కదా, మీ మనస్సుకు ఒక్కటి కూడా కనెక్ట్ కాలేదా? అని అడగ్గా.. ‘కనెక్ట్ అయ్యాయి. నా జీవితంలో చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. నేను ఓ సీరియల్ డేటర్‌ను అని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం బ్రేక్ తీసుకున్నా’ అని రెజీనా చెప్పారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

Also Read: Amazon Great Indian Festival: బిగ్ సేల్‌కు సిద్ధమైన అమెజాన్‌.. మొబైల్స్‌పై 40 శాతం తగ్గింపు!

తెలుగు యువ హీరోలతో రెజీనా కసాండ్రా ప్రేమాయణం నడిపినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో సాయి తేజ్, సందీప్ కిషన్ కూడా ఉన్నారు. ‘ఎస్‌ఎంఎస్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. అనతికాలంలోనే స్టార్ అయ్యారు. ఆ మధ్యన చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న ఓ హిందీ సినిమాలో చేస్తున్నారు. మరో రెండు హిందీ చిత్రాలు ఒప్పుకున్నారు.

Exit mobile version