Site icon NTV Telugu

UBS OTT Rights: నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లాయింగ్ డీల్.. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’కు రికార్డ్ బ్రేకింగ్ ధర!

Ustaad Bhagat Singh Release Date

Ustaad Bhagat Singh Release Date

UBS OTT Rights: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి జెట్ స్పీడ్‌లో రెడీ అవుతుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, బిజినెస్ పరంగా ఈ మూవీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లాయింగ్ డీల్ ఆఫర్ చేసిందని టాక్ నడుస్తుంది.

READ ALSO: Anil Ambani: రూ. 40,000 కోట్ల బ్యాంకు మోసం.. ED ముందు హాజరైన అనిల్ అంబానీ..!

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజిటల్ హక్కులను దాదాపు 80 కోట్లకు దక్కించుకుందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే నిజం అయితే తెలుగు సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించి చిత్ర బృందం, నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సినిమా విడుదల కాకముందే థియేటర్ హక్కులు, డిజిటల్ హక్కులు అన్నీ కలిపి దాదాపు రూ.140 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా. గతంలో ‘OG’ సినిమా హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు తీసుకుంది, ఇప్పుడు ‘ఉస్తాద్’తో ఆ రికార్డును కొనసాగిస్తోందని పవన్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు దాదాపు రూ.70 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ – హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్ ఈ స్థాయి ధరను నిర్ణయించినట్లు ట్రేడ్ వర్గాల అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతానికి ఈ డీల్ చర్చల దశలోనే ఉంది. త్వరలోనే దీనిపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ డైలాగులు, స్వాగ్‌తో థియేటర్లను ఊపేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

READ ALSO: Saudi Arabia: ఇండియాతో సహా 40 దేశాల నుంచి చికెన్, గుడ్లను నిషేధించిన ముస్లిం దేశం..!

Exit mobile version