ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్ తాజాగా దేహ్రాదూన్ సాహిత్య ఉత్సవంలో పాల్గొని తన సంగీత ప్రయాణం, స్టైల్స్, గుర్తుండిపోయే అనుభవాలను పంచుకున్నారు. తన ప్రత్యేకమైన గాత్రం, దుపట్టా–బొట్టు–కంచీవరం లుక్‌తో స్టేజ్ మీద ఎప్పుడూ సందడి చేసే ఈ సింగర్, ఈసారి తన మనసులోని మాటలు బయటపెట్టారు. “లతాజీ, ఆశాజీలా పాడలేనని ఆరంభంలోనే తెలుసుకున్నా. కానీ నాకు నేను నిజంగా ఉండటం వల్లే ఇంకా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు” అని ఉషా అన్నారు. తన తొలి కాంచీవరం చీరను కూడా మద్రాస్‌లో జరిగిన ప్రదర్శన బహుమతిగానే పొందానని ఆమె గుర్తు చేసుకున్నారు.
Also Read : NTR–Neel: డ్రాగన్ షూటింగ్ రేస్‌లో దూసుకెళ్తున్న ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్
పలు భాషల్లో పాడగలగడం తనకు ట్రోఫీలు కోసమో, రికార్డులు కోసమో కాదు “ప్రేక్షకులు ఎంజాయ్ కావడం, మ్యూజిక్‌ను ఫీల్ అవడం – అదే నాకు ముఖ్యం” అని అన్నారు. రేడియోనే తన అసలైన గురువని, అక్కడ వినిపించిన పాటలే తనకు ప్రేరణ అని తెలిపారు. ఈ సందర్భంలో ఒక చిన్న కానీ హార్ట్‌టచింగ్ అనుభవాన్ని కూడా పంచుకున్నారు ఉషా ఉతుప్. “ఇండస్ట్రీలో ఇన్ని ఏళ్లు ఉన్న, కొందరికి నేను తెలియకపోవచ్చు. ఓసారి ఓ అమ్మాయి నా దగ్గరే తిరుగుతుండడంతో సెల్ఫీ అడుగుతుందని అనుకున్నా. కానీ ‘మీరు సింగర్ రునా లైలానా?’ అని అడిగింది. నేను ‘లేదు, నేను ఉషా ఉతుప్‌ను’ అన్నా. వెంటనే వెళ్ళిపోయింది. సెల్ఫీ కూడా తీసుకోలేదు”. ఈ సంఘటనపై ఆమె నవ్వుకుంటూ, “మనల్ని మనం అంత సీరియస్‌గా తీసుకోవద్దు. నేను కూడా తీసుకోను. అదే నాకు బలం” అని చెప్పారు.
