Site icon NTV Telugu

Text To Video: ఇది కావాలని చెప్తే చాలు.. క్షణాల్లో వీడియో రెడీ

New Project (12)

New Project (12)

Text To Video: ఇటీవల కాలంలో చాట్ జీపీటీ ఎంతటి ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. గూగుల్ సంస్థే చాట్ జీపీటీకి భయపడిందంటే నమ్మశక్యంగా లేదు. ప్రస్తుతం అందతా అర్టిఫిసియల్ ఇంటలిజెన్స్(ఏఐ) కాలం నడుస్తోంది. దీంతో మరెన్నో అద్భుతాలు భవిష్యత్ లో మన ముందుకు రాబోతున్నాయి. ఇటీవల వచ్చిన చాట్‌జీపీటీ వాటిలో ఒకరకం మాత్రమే. అది ‘జనరేటివ్‌ ఏఐ’కి ఉదాహరణ. చాట్ జీపీటీ ద్వారా మనం కేవలం టెక్ట్స్ మాత్రమే జనరేట్ చేయగలం. జనరేటివ్‌ ఏఐ తెలివితేటలు దీనికిమాత్రమే పరిమితంకావట్లేదు. నానాటికీ కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. జనరేటివ్‌ ఏఐలో తదుపరి దశ.. టెక్స్ట్‌ టు ఇమేజ్‌. అంటే కొన్ని గుర్తులు చెప్పి వాటి బేస్ చేసుకుని ఒక బొమ్మ గీయమంటే గీస్తుంది. దాన్ని కూడా దాటి మనం ఇచ్చే ఇన్‌పుట్స్‌ ఆధారంగా వీడియోలు (టెక్స్ట్‌ టు వీడియో) రూపొందించే దశకు జనరేటివ్‌ ఏఐ చేరుకుంది.

Read Also: Kerala Train: రైలులో తోటి ప్యాసింజర్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వ్యక్తి.. ముగ్గురి మృతి

అమెరికాకు చెందిన ‘రన్‌వే’ అనే స్టార్టప్‌ రూపొందించిన జెన్‌-2 మోడల్‌ ఏఐ ఈ ‘టెక్ట్స్‌ టు వీడియో’ అద్భుతాన్ని సాధించింది. చాట్‌జీపీటీ సృష్టికర్తలే అభివృద్ధి చేసిన ‘డాల్‌-ఈ’ కూడా ఇంచుమించుగా ఇదే పని చేయగలదు. 2022 సెప్టెంబరులోనే ‘మెటా’ కూడా ‘మేక్‌ ఏ వీడియో’ అనే ఒక టూల్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇది కూడా మనమిచ్చే టెక్స్ట్‌ ఇన్‌పుట్‌తో వీడియోలను తయారుచేస్తుంది. అయితే దీంట్లో ఎలాంటి శబ్దాలూ ఉండవు. శబ్దాలను తర్వాత ఎడిటింగ్ టూల్ తో యాడ్ చేసుకోవచ్చు. మెటా సంస్థ ఈ టూల్‌ను విడుదల చేసిన వారం రోజుల్లోనే గూగుల్‌ కూడా ‘ఇమాజెన్‌ వీడియో’ పేరుతో ఓ టెక్స్ట్‌ టు వీడియో ఏఐ మోడల్‌ను ప్రకటించింది. ఇప్పటిదాకా చెప్పుకొన్న ఏఐ మోడళ్లన్నీ 10 నిమిషాల్లోపు నిడివిగల వీడియోలను టెక్స్ట్‌ ద్వారా రూపొందించేవే. అంతకు మించిన నిడివిగల వీడియోలను రూపొందించే ‘ఫెనాకీ’ అనే మరో ఏఐ మోడల్‌ను కూడా గూగుల్‌ అభివృద్ధి చేసింది.

Read Also: Marvel Cinematic Universe: సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 నుంచి ఫస్ట్ సీరీస్…

టెక్స్ట్‌ టు వీడియో ఏఐ మోడళ్ల సాయంతో ఎలా పడితే అలా వీడియోను రూపొందించుకోవచ్చనుకుంటే పొరబాటే. దీంట్లో చాలా సమస్యలున్నాయి. మనం ఇచ్చే కమాండ్లు చాలా కచ్చితంగా ఉండాలి. అలాగే ఈ కమాండ్ల ద్వారా పోర్న్‌ వీడియోలు చేయకుండా ఏఐని నియంత్రించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏ పేరున్న హాలీవుడ్‌ నటి పేరునో ప్రస్తావించి ఆమెతో ఒక పోర్న్‌ వీడియో చేయాలని కమాండ్‌ ఇస్తే ఏఐ దాన్ని తిరస్కరించాలి. ఆత్మహత్యలకు, నేరాలకు పురిగొల్పే తరహా వీడియోలను రూపొందించకుండా శిక్షణ ఇవ్వాలి.

Exit mobile version