USA: #TrumpIsDead..! స్పందించిన యూఎస్ ఉపాధ్యక్షుడు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్.. ప్రతీకార సుంకాలతో ప్రపంచంపై దాడి చేస్తూ నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజా ట్రంప్ మరోసారి వార్తలకెక్కారు. అది కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి జోరుగా సాగుతున్న పుకార్లతో. కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఇక లేరంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు. ఇంతకీ ఈ ప్రచారంపై వైట్ హౌస్ ఏమంది, యూఎస్ ఉపాధ్యక్షుడు ఏమని స్పందించారు.. అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Pawan Kalyan: ఖచ్చితంగా ‘జనసేన’ జాతీయ పార్టీగా ఎదుగుతుంది.. హాస్యాస్పదంగా ఉండొచ్చు మీకు..!
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ప్రచారానికి బలం చేకూర్చిన గుర్తు..
గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం గురించి చాలా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలకు ఓ కారణం ఉంది. ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే మ్యుంగ్‌తో జరిగిన సమావేశంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిపై నీలిరంగు గుర్తు కనిపించింది. ఎప్పుడు ఆయన చేతిపై ఈ గుర్తును ప్రపంచం చూసిందో అప్పటి నుంచి ట్రంప్ ఆరోగ్యంపై జోరుగా ప్రచారం జరగడం ప్రారంభం అయ్యింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ట్రంప్ చాలా రోజులుగా బహిరంగంగా కనిపించలేదు. దీనికి అదనపు బలం తోడైనట్లు వైట్ హౌస్ పై అమెరికన్ జెండా సగం ఎత్తులో ఎగురవేశారు. ఇవన్నీ కలవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఊహాగానాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత ఏకంగా #TrumpIsDead అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం ప్రారంభించింది.
ఇక్కడ వాస్తవం వేరేలా ఉంది. మీకు తెలుసో లేదో.. అమెరికాలో ఒక సంప్రదాయం ఉంది. ఏదైనా పెద్ద ప్రమాదం లేదా విషాదం జరిగినప్పుడు, ఆ దేశ జాతీయ జెండాను సగం ఎత్తుకు దించి సంతాపం ప్రకటిస్తారు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ జరిగింది అదే. మిన్నియాపాలిస్ చర్చిలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 17 మంది గాయపడ్డారు. దీంతో ట్రంప్ ఆదేశాల మేరకు, దాడికి సంతాపంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలపై ఉన్న జెండాను ఆగస్టు 31 వరకు సగం ఎత్తుకు దించారు. ఇదీ అసలు సంగతి. ట్రంప్ ఆరోగ్యంపై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ కూడా ఒక ప్రకటనలో స్పందించారు. అధ్యక్షుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారని అన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎదుర్కోడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, కానీ ట్రంప్ కచ్చితంగా తన అద్భుతమైన పనిని కొనసాగిస్తారని, అమెరికన్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.
ట్రంప్ ఆరోగ్యం గురించి ఆయన వ్యక్తిగత వైద్యుడు షాన్ బార్బబెల్లా స్పష్టత ఇచ్చారు. అధ్యక్షుడి చేతిపై కనిపించే గుర్తు ఏ తీవ్రమైన వ్యాధికి సంకేతం కాదని చెప్పారు. ఇది చిన్న మృదు కణజాల చికాకు, ఇది తరచుగా ఎక్కువగా కరచాలనం(షేక్‌హ్యాండ్) చేయడం, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకోవడం వల్ల వస్తుందన్నారు. దేశాధ్యక్షుడి మానసిక, శారీరక ఆరోగ్యం చాలా బాగుందని వెల్లడించారు.
READ ALSO: Delhi Murder: ఢిల్లీలో ఘోరం.. కత్తెరతో భార్య, అత్తను చంపేశాడు
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!