USA Delivery Jobs: సరదాగా పని చేస్తూ ఒక్క రోజుకు రూ.20 వేలు సంపాదిస్తున్న అమెరికన్స్.. ఆ పని ఏంటో తెలుసా?
- డెలివరీ చేస్తూ నెలకు రూ.6 లక్షల సంపాదన..
- అమెరికాలో డెలివరీ జాబ్స్‌కు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA Delivery Jobs: భారతదేశంలో డెలివరీ బాయ్ అనగానే నెలకు రూ.25-30 వేల సంపాదన, ఎండనక వాననక కష్టపడే పని అని మనం అనుకుంటాం. కానీ అమెరికాలో సీన్ పూర్తిగా రివర్స్.. అక్కడ డెలివరీ జాబ్ అనేది ఒక మజా కలిగించే పని. అందుకే అక్కడ పురుషుల కంటే మహిళలే ఈ వృత్తిలో ఎక్కువగా కనిపిస్తుంటారు. కేవలం పార్ట్ టైమ్ పని చేస్తూనే లక్షల్లో సంపాదించడం అక్కడ విశేషం. దీని కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్!
నెలకు రూ.6 లక్షలు ఎలా సాధ్యం అంటే..
అమెరికాలో ఒక డెలివరీ పర్సన్ నెలకు రూ.5 – 6 లక్షల వరకు సులభంగా సంపాదిస్తారని వింటే ఆశ్చర్యం కలగక మానదు. అమెరికాలో సగటున ఒక డెలివరీ పర్సన్ గంటకు 20 నుంచి 25 డాలర్లు (సుమారు రూ.1,800 – 2,200) సంపాదిస్తారు. అక్కడ డెలివరీ చేసేవారు ఉబెర్ ఈట్స్ (Uber Eats), డోర్ డాష్ (DoorDash) వంటి నాలుగైదు యాప్‌లను ఒకేసారి ఉపయోగిస్తారు. తక్కువ దూరంలో ఉండి, ఎక్కువ డబ్బులు వచ్చే ఆర్డర్లను మాత్రమే ఎంచుకుంటారు. రోజుకు కేవలం 4 గంటలు పని చేసేవారు కూడా సులభంగా 100 డాలర్లు (రూ.9,000) జేబులో వేసుకుంటారు. ఇక 8 గంటలు ఫుల్ టైమ్ కష్టపడితే రోజుకు రూ.20 వేల వరకు సంపాదిస్తారు.
టిప్స్‌తోనే అసలు కథ..
అమెరికాలో డెలివరీ ఫీజు కంటే కస్టమర్లు ఇచ్చే ‘టిప్’ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. అక్కడ ప్రతి డెలివరీకి టిప్ ఇవ్వడం ఒక సంప్రదాయం. సాధారణంగా ప్రతి ఆర్డర్‌కు 10-15 డాలర్లు టిప్ వస్తుంది. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి పెద్ద నగరాల్లో అయితే ఒకే ఆర్డర్‌పై 30 డాలర్ల (సుమారు రూ.2,700) వరకు టిప్ వచ్చే అవకాశం ఉంటుందట. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి ఖరీదైన నగరాల్లో ఆర్డర్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. లంచ్, డిన్నర్ సమయాల్లో పని చేసే వారికి కంపెనీలు ప్రత్యేక బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు ఇస్తాయి. దీనిని ‘సర్జ్ ప్రైసింగ్’ అంటారు. ఈ సమయంలో పని చేసేవారు గంటకు 30 డాలర్లకు పైగా సంపాదిస్తూ, నెలకు రూ.6 లక్షల మైలురాయిని సులభంగా చేరుకుంటున్నారు. మొత్తానికి అమెరికాలో డెలివరీ జాబ్ అనేది కేవలం అవసరం కోసం చేసే పని కాదు.. అది ఒక స్మార్ట్ ఎర్నింగ్ ఆప్షన్‌గా మారిపోయింది.
READ ALSO: Stock Market: స్టాక్ మార్కెట్‌లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
తాజావార్తలు
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?