మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీత ఆర్ట్స్ తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.
ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా ‘సాత్విక వీరవల్లి’ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. ఈ సినిమా నుండి ఆమె మొదటి గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది. తొలి సినిమా అయినా కూడా మంచి ప్రదర్శన కనబరిచింది సాత్విక. గ్లిమ్స్ లో ఆమె నటన, హావభావాలు చాలా బాగున్నాయి. సాత్విక వీరవల్లి విషయానికి వస్తే అమెరికాలో జన్మించిన తమిళ అమ్మాయి. ఆకాశంలోఒకతార చిత్రంతో సినీరంగ ప్రవేశం చేస్తోంది. సిస్టమ్స్ ఇంజనీరింగ్ మరియు డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సాత్విక 15 సంవత్సరాలుగా భరతనాట్యం నేర్చుకుంటోంది. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఆకాశంలో ఒక తారతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ వరుసగా నాలుగవ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read : Tollywood Movies : సంక్రాంతి సినిమాల అసలు రంగు తెలిసేది నేటి నుండే
