Rising Political Violence Among U.S. Youth: అమెరికన్ యువతలో కోపం పెరుగుతుందా? ఆ దేశంలో రాజకీయ హత్యలు పెరుగుతన్నాయా? ప్రస్తుతం ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి, గత వారం డొనాల్డ్ ట్రంప్‌కు దగ్గరగా ఉన్న మితవాద నాయకుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు. హంతకుడు టైలర్ రాబిన్సన్ 22 ఏళ్ల యువకుడు. రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో ట్రంప్ మిత్రుడైన చార్లీ కిర్క్ వ్యవహార శైలి అతడికి నచ్చలేదు. అందుకే హత్య చేసినట్లు తెలుస్తోంది. యూఎస్‌లో ఇదొక్కటే కాదు.. జూన్‌లో, డెమొక్రాటిక్ నాయకురాలు మెలిస్సా హార్ట్‌మన్‌ను ఆమె కుటుంబంతో సహా కాల్చి చంపారు. వాస్తవానికి, అమెరికా హింస నుంచి పుట్టింది. అంతర్యుద్ధం ఒక శతాబ్దం కంటే తక్కువ కాలం కొనసాగింది. అనంతరం మార్టిన్ లూథర్ కింగ్ లేదా కెన్నెడీ నాయకుల హత్యల పరంపర ప్రారంభమైంది. మొత్తంమీద, అమెరికన్ రాజకీయాల్లో హింస తరచుగా కనిపించేది. కానీ ఇప్పుడు అది మరింత భయానకంగా మారుతోంది. దీనికి కారణం ఏంటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పెరుగుతున్న గన్‌కల్చర్..!
వాస్తవానికి.. అప్పట్లో తుపాకులు అంత సులభంగా అందుబాటులో ఉండేవి కావు. ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 850 మిలియన్ల ఆయుధాలు ప్రైవేట్ చేతుల్లో ఉన్నాయి. ఈ ఆయుధాలలో సగానికి పైగా అమెరికాలోనే ఉన్నాయి. ప్రతి 100 మంది అమెరికన్ల వద్ద 120 తుపాకులు ఉన్నాయి. ఎవరికైనా కోపం వస్తే శాంతించడానికి అవకాశం లేదు. డైరెక్ట్‌గా గన్ గురిపెట్టి కాల్చేయడమే.
గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
కిర్క్ హత్య తర్వాత.. ట్రంప్‌తో సహా చాలా మంది రిపబ్లికన్ నాయకులు, వామపక్షాలు రాజకీయ హింసను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఎలోన్ మస్క్ కూడా ఎక్స్‌లో వామపక్షాలు ఒక హంతకుల ముఠా పేర్కొన్నాడు. కిర్క్ హత్య కేసులో నిందితుడి ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక అనామక యువకుడు. ట్రంప్‌కు దగ్గరగా ఉన్న నాయకుడిపై ఎందుకు దాడి చేశాడు? అనే ప్రశ్న అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ హత్యకు ప్రధాన కారణం.. రెచ్చగొట్టే ప్రసంగాలు పెద్ద పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు ట్రంప్‌ను తీసుకుంటే.. ఆయన మాటలు ఇటీవల మరింత హింసాత్మకంగా మారాయని నిపుణులు భావిస్తున్నారు. ది కన్వర్సేషన్ నివేదిక ప్రకారం.. మొదటి పదవీకాలానికి ముందు.. ట్రంప్ ప్రసంగాలలో 0.6% హింసాత్మక పదాలు ఉపయోగించారు. ఇది 2024 సంవత్సరంలో 1.6%కి పెరిగింది. ఎన్నికలకు ముందు.. ట్రంప్ దేశంలో రక్త నదులు ప్రవహించవచ్చంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అదే పరంపరను కొనసాగించారు. ఇంటర్వ్యూలలో మాట్లాడేటప్పుడు హత్య, అత్యాచారం, దుండగుడు వంటి పదాలను వాడుతూనే ఉన్నారు. మరోవైపు.. డెమోక్రటిక్ నాయకులు కూడా రెచ్చగొట్టే, హింసాత్మక ప్రసంగాలు చేస్తున్నారు. గత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డోనాల్డ్ ట్రంప్‌ను ఫాసిస్ట్ అని అభివర్ణించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపైకి సైన్యాన్ని పంపుతారని ఆరోపించారు.
READ MORE: Special Focus on Weather : పెరుగుతున్న ఉరుములు–మెరుపులు ఆరు నెలల్లో 1,621 మంది మృతి.
ఈ ప్రసంగాలతో ప్రజాలు కోపాన్ని పెంచుకుంటున్నారు. ఈ కోపం కొన్నిసార్లు ఎంతగా పెరుగుతుందంటే ప్రజలు ఒకరినొకరు చంపుకునే దాక వెళ్తోంది. ఏప్రిల్‌లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. ఐదుగురు అమెరికన్లలో ఒకరు రాజకీయ హింస, హత్యలు కొన్నిసార్లు తప్పు కాదని నమ్ముతున్నారు. మరో అంశం ఏంటంటే.. తాము ఆదరించే నాయకులు కోపం, భయం లేదా నిరాశను వ్యక్తం చేస్తే.. వారి మద్దతుదారులు కూడా అదే అనుభూతి చెందుతారు. మరోవైపు.. శాంతియుతంగా ఉంటే మద్దతుదారులు సైతం హింసను ప్రోత్సహించరు. ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక అధ్యయనాలు జరిగాయి.
ఈ సంవత్సరం కొన్ని రాజకీయ హత్యలు..
– ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ పై కాల్పులు జరిగాయి. కిర్క్ రాజకీయ సిద్ధాంతాలతో తాను విభేదిస్తున్నానని దాడి చేసిన వ్యక్తి చెప్పాడు.
– ఏప్రిల్‌లో పెన్సిల్వేనియా గవర్నర్ నివాసంలో కాల్పుల సంఘటన జరిగింది. గవర్నర్, వారి కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశ్యంతో నిందితుడు నిప్పంటించాడు.
– జూన్‌లో కొలరాడోలో ఒక వ్యక్తి ఇజ్రాయెల్ బందీలకు మద్దతుగా జరిగిన మార్చ్‌పై దాడి చేసి, అనేక మందిని గాయపరిచాడు.
– జనవరిలో న్యూ ఓర్లీన్స్‌లో ఒక వ్యక్తి జనసమూహంలోకి ట్రక్కును నడిపి 15 మందిని చంపి, డజన్ల కొద్దీ గాయపరిచాడు. హంతకుడు ట్రంప్‌పై పాలనపై కోపంగా ఉన్నాడని చెబుతున్నారు.
