Site icon NTV Telugu

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటిపై కాల్పులు.. అయితే!

Jd Vance

Jd Vance

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఉపాధ్యక్షుడి ఇంటి గాజు కిటికీలు ఈ దాడి కారణంగా పగిలిపోయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాల్పుల కారణంగా JD వాన్స్ ఇంటి గాజు కిటికీకి అనేక రంధ్రాలు కనిపించాయి. దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.

READ ALSO: Lenin: కట్టుకోబోయే వాడికి కళ్లతో మాట్లాడిన వినబడుతుందంటున్న.. భాగ్యశ్రీ భోర్సే

అమెరికా మీడియా నివేదికల ప్రకారం.. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఒహియో నివాసంలో ఈ కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ క్రమంలో అధికారులు సంఘటన వెలుగు చూసిన తర్వాత ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పలు నివేదికల ప్రకారం.. సంఘటన జరిగిన సమయంలో ఉపాధ్యక్షుడి కుటుంబం ఇంట్లో లేదు, అలాగే దాడి చేసిన వాళ్లు ఉపాధ్యక్షుడి ఇంట్లోకి ప్రవేశించలేదని అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి తీసిన చిత్రాల్లో ఉపాధ్యక్షుడి నివాసం కిటికీలు పగిలిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈ దాడి చేసిన వాళ్లు జేడి వాన్స్‌ను లేదా ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారా అని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోందని ఒక పోలీసు అధికారి చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.

READ ALSO: The RajaSaab: ‘ది రాజాసాబ్’ కు ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదే..

Exit mobile version