Lenin: అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లెనిన్’. యంగ్ హీరో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘వారేవా వారేవా’ ఈ రోజు రిలీజ్ అయింది.. ఈ సింగిల్ స్టార్టింగ్‌లో ‘భారతి’గా కనిపించనున్న భాగ్యశ్రీ భోర్సే మాట్లాడుతూ.. కట్టుకోబోయే వాడికి కళ్లతో మాట్లాడిన వినబడుతుందని చెబుతూ స్టార్ట్ అవుతుంది. ఇందులో రొమాంటిక్ లవర్ బాయ్ ఇమేజ్‌లో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జోడీ కెమిస్ట్రీ చూస్తే.. ఫిదా అయిపోవాల్సిందే.. !
READ ALSO: ఎలుకల బెడదతో విసిగిపోయారా? ఇల్లు తుడిచే నీటిలో ఇది కలిపితే చాలు.. చిటికెలో మాయం!
స్టార్ ప్రొడ్యూసర్ కింగ్ అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ఈ ఈ సాంగ్‌ను షేర్ చేస్తూ.. “అదిరిపోయిన మెలోడీ.. థమన్ మ్యూజిక్, అనంత శ్రీరాం లిరిక్స్, శ్వేతా మోహన్ & జూబిన్ నౌటియాల్ వాయిస్.. సూపర్బ్!” అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి.. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ & సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. విలేజ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 1, 2026లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. వెండి తెరపై ఈ జోడీ ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చిత్ర రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
READ ALSO: The RajaSaab: ‘ది రాజాసాబ్’ కు ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదే..