Hamas: మూల్యం చెల్లించుకుంటారు.. అమెరికాకు హమాస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా మరోసారి నివురుగప్పిన నిప్పులా మారింది. అమెరికా జరిగిస్తున్న బాంబుల దాడితో దద్దరిల్లుతోంది. దీంతో గత కొద్దిరోజులుగా రక్తపుటేరులు పారుతున్నాయి. ఇక జోర్డన్‌లో ఇటీవల మిలిటెంట్లు జరిపిన డ్రోన్ దాడుల కారణంగా ముగ్గురు అమెరికన్ సైనికులు మృత్యువాతకు గురయ్యారు. దీనికి ప్రతీకారంగా సిరియాలో మిలిటెంట్ల స్థావరాల లక్ష్యంగా అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ మద్దతిస్తున్న 40 మంది మిలిటెంట్లు మరణించినట్లు తెలుస్తోంది.
హమాస్ వార్నింగ్…
ఇరాక్, సిరియాలోని ఇరాన్ (Iran) మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలపై అమెరికా (USA) దాడులు చేయడాన్ని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) తీవ్రంగా తప్పుబట్టింది. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉందని పరిగణించింది. ఆయా దేశాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు అమెరికా పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్‌కు సాయం చేస్తూ పాలస్తీనాలోని సామాన్యులను బలి తీసుకుంటోందని విమర్శించింది. ఇలాంటి చర్యలతో ఉద్రిక్తతలు మరింత ఎక్కువవుతాయే తప్ప.. తగ్గబోవని హెచ్చరించింది. ఇజ్రాయెల్ దురాక్రమణ, గాజాలోని ప్రజలపై మారణహోమానికి ముగింపు పలికినప్పుడే ఆయా ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఇటీవల అమెరికా సైనిక క్యాంప్‌పై డ్రోన్ దాడి జరగడంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అగ్రరాజ్యం.. ఇరాక్, సిరియాల్లోని 85 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఇరాన్ మద్దతిస్తున్న 40 మంది మిలిటెంట్లు మరణించినట్లు యూకేలోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. అలాగే ఇరాక్‌లో 16 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు బాగ్దాద్ తెలిపింది.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!