Site icon NTV Telugu

US: పాలస్తీనా నిరసనలపై అమెరికా ఉక్కుపాదం

Pale

Pale

పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. నిరసనలపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడే నిరసనకారులకు సంకెళ్లు బిగించారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని అచింత్య శివలింగన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాదు క్యాంపస్ ఆవరణలో విద్యార్థుల నేతృత్వంలోని పాలస్తీనా అనుకూల శిబిరం నిరసనలో పాల్గొన్నందుకుగాను ఆమెను యూనివర్శిటీనుంచి నిషేధించారు. గత రెండ్రోజులుగా నిరసనలతో యూనివర్సిటీలు దద్దరిల్లుతున్నాయి.

 

ఇదిలా ఉంటే విద్యార్థులను పోలీస్ అధికారులు అడ్డుకుంటుండగా మధ్యలో జోక్యం చేసుకున్న అమెరికాకు చెందిన ఒక మహిళా ప్రొఫెసర్‌ కరోలిన్ ఫోహ్లిన్‌ను నేలపై పడగొట్టారు. అనంతరం చేతికి సంకెళ్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. తాను ప్రొఫెసర్‌ను అని చెప్పినా విడిచిపెట్టలేదు. ఎంతబతిమాలినా వదలేదు.. పైగా ఆమెను మరో పోలీస్ భూమిలోకి నొక్కేశాడు.

 

లాస్ ఏంజిల్స్, బోస్టన్ మరియు ఆస్టిన్, టెక్సాస్‌లోని విశ్వవిద్యాలయాలలో బుధవారం మరియు గురువారం యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. దీంతో 200 మందికి పైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున గుమిగూడి ఆందోళనలు చేపట్టారు. నిరసనకారుల్ని చెదరగొట్టడానికి భాష్పవాయువు కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది.

 

గురువారం తెల్లవారుజామున యూనివర్సిటీ ప్రాంగణంలో పాలస్తీనా అనుకూల నిరసనల మధ్య శివలింగన్‌తో పాటు, మరో విద్యార్థి హసన్‌ సయ్యద్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. నిరసనను నిలిపివేసి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని పదే పదే హెచ్చరించినా చెప్పినా వినకపోవడంతో వారిని అరెస్ట్‌ చేసినట్టు పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ యూనివర్సిటీ ప్రతినిధి జెన్నిఫర్ మోరిల్ తెలిపారు. కాగా తమిళనాడులోని కోయం బత్తూరుకు చెందిన శివలింగన్‌ ప్రిన్స్‌టన్‌లో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో పబ్లిక్ అఫైర్స్‌లో మాస్టర్స్ విద్యార్థి కాగా, సయ్యద్‌ పీహెచ్‌డీ చేస్తున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీలో ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా అనేక యూనివర్శిటీలకు పాకాయి. యేల్ సహా అనేక ఇతర విద్యా సంస్థలలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి.

 

గత కొద్ది రోజులుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. హమాస్.. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసింది. అనంతరం ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజా పట్టణాన్ని ధ్వంసం చేసింది. ఏడు నెలల నుంచి విరామం లేకుండా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. భవంతలు నేలమట్టం అయ్యాయి. ఇక గాజాలో34,305కి పైగా పాలస్తీనియన్లు మరణించారు. దీంతో వారికి సంఘీభావంగా అమెరికా యూనివర్సిటీలత్లో విద్యార్థులు నిరసనకారులు తెలుపుతున్నారు. ఇజ్రాయెల్ అధికారిక లెక్కల ప్రకారం అక్టోబర్ 7న దాదాపు 1,170 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పేర్కొంది. ఇక హమాస్ కూడా దాదాపు 250 మందిని ఇజ్రాయెలీయులను బందీలుగా పట్టుకుని తీసుకెళ్లింది. వీరిలో 34 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది.

Exit mobile version