US – Iran Tensions: ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ప్లాన్ చేస్తుంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అగ్రదేశం ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ఈ వైమానిక స్థావరంలో తాజాగా అమెరికా యుద్ధ విమానాల కదలిక పెరిగింది. అంతే కాకుండా, ఇరాన్‌లో నివసిస్తున్న తన పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని అమెరికా ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలు, ప్రాంతీయ అస్థిరత మధ్య అమెరికా తాజా హెచ్చరిక సంచలనంగా మారింది.
READ ALSO: Mobile Charging Tips: దిండ్లు, దిప్పట్లపై మొబైల్‌ను పెడుతున్నారా?.. డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!
అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ప్రత్యేకతలు..
ఖతార్ రాజధాని దోహాకు నైరుతి దిశలో దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం.. అల్ ఉదీద్ వైమానిక స్థావరం. ఇది మధ్యప్రాచ్యంలో అతిపెద్ద US సైనిక స్థావరం. ఇందులో10 వేల కంటే ఎక్కువ మంది US సైనికులకు నివాసంగా ఉంది. ఈ స్థావరంలో B-52 వ్యూహాత్మక బాంబర్లు, KC-135 వైమానిక ఇంధనం నింపే ట్యాంకర్లు, రవాణా విమానాలు వంటి పెద్ద విమానాలను నిర్వహించగల 4,500 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది. ఇది US సెంట్రల్ కమాండ్ (CENTCOM) యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇరాన్ సరిహద్దు నుంచి కేవలం 200-300 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం.. జనవరి 12, 2026న అనేక US విమానాలు అల్ ఉదీద్ నుంచి బయలుదేరాయి. వాటిలో KC-135 వైమానిక ఇంధనం నింపే ట్యాంకర్లు, B-52 వ్యూహాత్మక బాంబర్లు కూడా ఉన్నాయి. ఓపెన్ – సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT), ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. KC-135, KC-46A పెగాసస్ ట్యాంకర్, C-17 గ్లోబ్‌మాస్టర్ III, C-5M గెలాక్సీ వంటి భారీ రవాణా విమానాలు మధ్యప్రాచ్యానికి వెళుతున్నాయని చెప్పింది. ఇరాన్‌లో నిరసనల మధ్య ఈ వైమానిక స్థావరంలో అమెరికా సైనిక కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి.
అమెరికా హెచ్చరికలకు అర్థం ఏంటి..
ఇరాన్‌లోని US వర్చువల్ ఎంబసీ జనవరి 12, 2026న ఒక హెచ్చరిక జారీ చేసింది. US పౌరులు ఇరాన్‌కు ప్రయాణించకూడదని, ఎవరైనా ఇరాన్‌లో ఉంటే వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలని ఈ హెచ్చరికలో అగ్రరాజ్యం పేర్కొంది. ఇదే టైంలో ఇరాన్‌లో నెలకొన్న అశాంతి కారణంగా, అవసరమైతే తక్షణ చర్య తీసుకోవడానికి అమెరికా తన సైనిక సంసిద్ధతను పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చర్య ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణులు, ప్రాంతీయ అస్థిరతకు ముడిపడి ఉంది. అల్ ఉదీద్ స్థావరం మధ్యప్రాచ్యంలో అమెరికా శక్తికి చిహ్నంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ పెరిగిన సైనిక కార్యకలాపాలు, అగ్రరాజ్యం హెచ్చరికలు ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తుందనే సంకేతాలను ఇస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Quick Commerce: ఇకపై నో 10 మినిట్స్ డెలివరీ.. డెలివరీ బాయ్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్
