NTV Telugu Site icon

Houthi Rebels: హౌతీ రెబల్స్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా..

Us

Us

యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన నాలుగు మానవ రహిత డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా సైన్యం గురువారం నాడు వెల్లడించింది. కాగా, యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా (X)లో డ్రోన్లు ఈ ప్రాంతంలోని వ్యాపార నౌకలు, U.S. నౌకాదళ నౌకలకు దగ్గరగా వస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆ డ్రోన్‌లను యుఎస్ సైన్యం ధ్వంసం చేసిందని తెలిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని అని యుఎస్ సెంట్రల్ కమాండ్ నుంచి ఒక ప్రకటన వెల్లడైంది. యూఎస్ నౌకలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు.

Read Also: Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..!

ఇక, నవంబర్ నుంచి ఇప్పటి వరకు 27 సార్లు హౌతీ తిరుగుబాటు దారులు దాడులు చేశారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన గాజాలో గాజాలో బెంజమన్ నెతన్యూహు సృష్టి్స్తున్న ఆరాచకానికి ప్రతీకారంగా హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో ఈ దాడులకు దిగింది. అయితే, క్షిపణులు, డ్రోన్‌లను క్షిపణులు మరియు డ్రోన్‌లను కాల్చడానికి హౌతీ మిలిటెంట్లు ఉపయోగించిన యెమెన్‌లోని సైట్‌లపై అమెరికా సైనికులు దాడులు చేసింది.