Site icon NTV Telugu

Nicolas Maduro: మదురో పట్టుకోడానికి పెట్టిన ఖర్చుతో.. ఇండియాలో ఎన్ని వేల కుటుంబాలు బతుకుతాయో తెలుసా!

Nicolas Maduro

Nicolas Maduro

Nicolas Maduro: అమెరికా హిట్ లీస్ట్‌లో ఉన్న దేశాధ్యక్షుడు వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో. ఈయనను గత ఏడాది కాలంగా వెనిజులా రాజధాని నుంచి పట్టుకోవడానికి అమెరికా ఇప్పటి వరకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు సమచారం. వాస్తవానికి ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ” మేక్ అమెరికా గ్రేట్ ” ( MAGA ) ప్రచారానికి వ్యతిరేకంగా భావిస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ MAGA నినాదాన్ని ప్రయోగించారు. ఇంతకీ MAGA నినాదం అంటే.. అమెరికా మరొక దేశంలో కార్యకలాపాలకు లేదా సైనిక చర్యకు ఒక్క డాలర్ కూడా ఖర్చు చేయదని అర్థం.. సరే ఇంతకీ మదురోను పట్టుకోడానికి అమెరికా గంటకు ఎన్ని డాలర్లు ఖర్చు చేసిందో ఈ సోర్టీలో తెలుసుకుందాం.

READ ALSO: Nayanathara : బాలయ్య సినిమాకి బడ్జెట్ దెబ్బ.. నయన్ అవుట్?

అమెరికన్ మీడియా ఆక్సియోస్ ప్రకారం.. వెనిజులాలో నికోలస్ మదురోపై CIA ఆపరేషన్‌కు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నాయకత్వం వహించారు. భవిష్యత్తులో ఈ ఆపరేషన్ విఫలమైతే, రూబియోను నిందించాల్సి వస్తుంది.

మదురోను పట్టుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు చేశారంటే..
1. మదురోను పట్టుకోడానికి వాస్తవానికి అమెరికా సెప్టెంబర్ 2025 లో ఆపరేషన్ సదరన్ స్పియర్‌ను ప్రారంభించింది. డిఫెన్స్ వన్ మ్యాగజైన్ ప్రకారం… ఈ ఆపరేషన్‌లో ఒక యుద్ధనౌక , ఒక అణు జలాంతర్గామి, జెరాల్డ్ ఫోర్డ్ మోహరించడానికి ప్లాన్ చేశారు. ఈ మూడు నౌకల ధర $40 బిలియన్లుగా అంచనా. అలాగే ఈ ఆపరేషన్ కోసం 83 ఫైటర్ జెట్‌లు, 10 F-35 జెట్‌లు, 7 రీపర్ డ్రోన్‌లను మోహరించారు. ఈ మూడు ఆయుధాల ధర $3 బిలియన్లు ఉంటుందని టాక్. వెనిజులాను దిగ్బంధించడానికి అమెరికా మోహరించిన అన్ని ఆయుధాల నిర్వహణ ఖర్చు గంటకు $333,000 (సుమారు రూ.3 కోట్లు) అని ఈ పత్రిక తెలిపింది. మొత్తం ఆపరేషన్ సెప్టెంబర్ నుంచి జనవరి వరకు దాదాపు 3,700 గంటలు పట్టింది. మొత్తం ఆపరేషన్ జరిగిన 3,700 * 3కోట్లు = 11,100 కోట్లు వస్తాయి. ఈ మొత్తాన్ని ఇండియాలో ఒక్కో కుటుంబానికి కోటి చొప్పున ఇస్తే సుమారుగా 11,100 కుటుంబాలు సంతోషంగా బతుకుతాయి.

2. వెనిజులా అధ్యక్షుడు మదురోపై అమెరికా 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 450 కోట్లు) బహుమతిని ప్రకటించింది. ఆపరేషన్ జరిగిన వెంటనే ఈ బహుమతిని అధికారులకు పంపిణీ చేశారు. హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసిన పైలట్‌కు సుమారు $2 మిలియన్లు ఇచ్చారు. ఈ డబ్బును కూడా అమెరికా నిధుల నుంచే పంపిణీ చేశారు. ఒసామా బిన్ లాడెన్ కంటే రెండు రెట్లు బహుమతిని మదురో కలిగి ఉన్నాడు.

3. మదురోపై CIA రహస్య ఆపరేషన్ నిర్వహించింది. వైట్ హౌస్ నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం CIA కి $ 101 బిలియన్లు ( సుమారు రూ. 9 లక్షల కోట్లు) బడ్జెట్ ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో $73 బిలియన్లు నిఘా సేకరణ కోసం, $28 బిలియన్లు సైనిక కార్యకలాపాల కోసం కేటాయించారు. ఈ బడ్జెట్‌లో ఎక్కువ భాగం వెనిజులా కోసం ఖర్చు అయ్యిందని సమాచారం. వాస్తవానికి మదురో అరెస్టును అమెరికా అత్యంత ఖరీదైన సైనిక చర్యగా అభివర్ణిస్తుంది. మదురోను పట్టుకోవడానికి అమెరికా 150 హెలికాప్టర్లను పంపింది. రాజధాని కారకాస్ చుట్టూ పదివేల మంది సైనికులను మోహరించారు. ఆగస్టు 2025 నుంచి అమెరికా దళాలు దాడికి ప్రణాళికలు వేస్తున్నాయి.

అమెరికా గతంలో 2020లో వెనిజులాపై ఆపరేషన్‌కు ప్రయత్నించింది , కానీ ఆ టైంలో అది విఫలమైంది. ఈసారి కచ్చితంగా అమెరికా తన ఆపరేషన్‌లో ఎటు వంటి లోపం రాకుండా జాగ్రత్త వహించింది. ఫస్ట్ మదురోను మాదకద్రవ్యాల నాయకుడిగా చిత్రీకరించడానికి పాశ్చాత్య మీడియాను ఉపయోగించుకుంది. ఆ తరువాత అగ్రరాజ్యం సైన్యం కారకాస్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. ట్రంప్ మదురోను వెనిజులా నుంచి పట్టుకోడానికి ప్రయత్నించారు, కానీ మదురో అమెరికాకు తలొగ్గడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత అధ్యక్షుడు ట్రంప్ ఈ ఆపరేషన్ బాధ్యతను మార్కో రూబియోకు అప్పగించారు. ఆయన, పీట్ హెగ్సేత్, CIA చీఫ్‌తో కలిసి ఈ ఆపరేషన్‌ను కంప్లీట్ చేశాడు.

READ ALSO: Jolin Tsai: ఓడియమ్మ అనకొండ.. 30 మీటర్ల అనకొండపై పెర్ఫామెన్స్ చేసిన జోలిన్ సాయ్.. వీడియో వైరల్

Exit mobile version