NTV Telugu Site icon

US Air Strikes: సిరియా, ఇరాక్ లోని ఇరాన్ స్థావరాలపై అమెరికా బాంబు దాడి.. ఆరుగురు మృతి

Us

Us

కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్‌లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వైమానిక దాడులు జరిపినట్లు వెల్లడించింది. యూఎస్‌ దళాలు 85 స్థావరాలపై 125కు మించిన యుద్ధ సామగ్రితో దాడి చేశాయి. అదే సమయంలో సిరియాలోని ఎడారి ప్రాంతాలు, ఇరాక్ సరిహద్దు సమీపంలో ఉన్న లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడిలో ఆరుగురు మృతి చెందారు.. చాలా మంది గాయపడ్డారని సిరియా ప్రభుత్వం వెల్లడించింది.

Read Also: Gold Price Today : బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే?

అయితే, ఈ దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఒక ప్రకటనలో అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామన్నారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన ముగ్గురు సైనికులు మరణించారని ఆయన తెలిపారు. నిన్న (శుక్రవారం) డోవర్ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో వీర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమంలో జో బైడెన్‌ పాల్గొన్నారు. ఇక, గత వారంలో జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. ఈ ఘటనలో సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద గ్రూపులపై ప్రతీకార దాడులు చేస్తుంది.