హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఆదివారం రాత్రి ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ అడవుల్లో కూలిపోయింది. దీంతో ఆయన మృతిచెందారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మృతిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.
ఇది కూడా చదవండి: West Bengal: రణరంగంగా మారిన బెంగాల్లో ఎన్నికల ప్రచారం.. సీసాలు, రాళ్లతో దాడి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక మరొకరి పాత్ర లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాధ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. 45 ఏళ్ల నాటి హెలికాప్టర్‌ను ఉపయోగించాలనుకోవడం.. అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: KTM Mew Colour: బైక్ రంగులు మార్చిన కెటిఎమ్ ఇండియా.. కొత్త కలర్స్ లో అందుబాటులోకి..
అంతకుముందు ఇరాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జావెద్ మాట్లాడుతూ హెలికాప్టర్ విడిభాగాల సరఫరాపై అమెరికా విధించిన ఆంక్షల వల్లే తమ అధ్యక్షుడు మరణించారన్నారు. కాగా రైసీ మృతికి కారణమైన బెల్ 212 హెలికాప్టర్‌లో సిగ్నల్ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నట్లు టర్కీ రవాణశాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ తెలిపారు. హెలికాప్టర్‌లో సిగ్నల్ వ్యవస్థ పని చేయడం లేదని, అసలు సిగ్నల్ వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియదన్నారు. హెలికాప్టర్ సిగ్నల్ కోసం తాము తొలుత ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. వీవీఐపీలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లలో సిగ్నల్ వ్యవస్థ ఉండి తీరాలని ఖదీర్ తెలిపారు.
ఇక ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ ముఖ్బర్ ఎన్నికయ్యారు. శాశ్వత అధ్యక్షుడు ఎన్నికయ్యేంత వరకు ఈయన అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇక అధ్యక్ష ఎన్నికలు జూన్‌లో జరగనున్నాయి. ఇక ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: SRH vs KKR: తడబడిన సన్ రైజర్స్.. 159 పరుగులకు ఆలౌట్
