US Government Shutdown: సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన అగ్రరాజ్యంలోని ట్రంప్ సర్కార్ షట్‌డౌన్ దిశగా సాగుతున్నట్లు సమాచారం. యూఎస్ గవర్నమెంట్ మంగళవారం షట్‌డౌన్ దిశగా సాగుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు అర్ధరాత్రితో ముగియనున్నాయని, డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ తమ డిమాండ్లపై పట్టుదలతో ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. ఇంతకీ అసలు కథ ఏంటో తెలుసా?, షట్‌డౌన్ వల్ల ఏర్పడే పరిణామాలు ఎలా ఉండనున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: TVK Vijay vs Police: కరూర్ తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్.. విజయ్పై పోలీసుల ఫైర్
అసంపూర్తిగా ముగిసిన వైట్ హౌస్ సమావేశం..
శ్వేతసౌధంలో సోమవారం జరిగిన చివరి సమావేశంలో ప్రభుత్వ నిధులు మంజూరు కావడంలో తలెత్తిన సమస్యకు పరిష్కారం చూపడంలో అధికార పార్టీ విఫలమైంది. డెమెక్రాట్లు, రిపబ్లికన్లు మధ్య తలెత్తిన ప్రధాన విభేదాలు ఇంకా మిగిలే ఉన్నాయని సెనేట్ డెమొక్రాట్ చక్ షుమెర్ అన్నారు. అయితే కాంగ్రెస్ ఉభయ సభలలో మైనారిటీగా ఉన్న ట్రంప్ ప్రభుత్వం తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత ఇది జరుగుతోంది. సెనేట్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిధుల బిల్లును ఆమోదించడానికి 60 ఓట్లు అవసరం. రిపబ్లికన్లకు ఉన్న ఓట్ల కంటే ఏడు ఓట్లు ఎక్కువ (53) అవసరం. మంగళవారం అర్ధరాత్రి ముందు కాంగ్రెస్ నిధుల బిల్లును ఆమోదించడంలో విఫలమైతే, వాషింగ్టన్‌లో కొత్త రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది.
షట్‌డౌన్ అయితే ఏం జరుగుతుంది..
షట్‌డౌన్ వల్ల అవసరమైన ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోతాయి, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలికంగా జీతాలు లేకుండా పోతాయి. అలాగే అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాల చెల్లింపులకు అంతరాయం ఏర్పడుతుంది. గత వారం వైట్ హౌస్.. ప్రభుత్వ సంస్థలను సాధారణ తాత్కాలిక సెలవుల కంటే తీవ్రమైన తొలగింపులకు సిద్ధం కావాలని ఆదేశించింది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగింపులు చేసిన తర్వాత తాజా చర్యలు ప్రభుత్వ ఉద్యోగులను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
ఇంతకీ డిమాండ్లు ఏంటి?
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ అనే అంశంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఏర్పడుతుంది. ఈక్రమంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ దానిని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారు. పొరపాటు ఒక వేళ అమెరికాలో షట్‌డౌన్ జరిగితే ఇరు పార్టీల వారు ఒకరినొకరు నిందించుకుంటారు. సోమవారం సెనేట్ రిపబ్లికన్ నాయకుడు జాన్ థూన్ మాట్లాడుతూ.. డెమొక్రాట్ల డిమాండ్లను “వారిని బందీలుగా తీసుకునే” ప్రయత్నంగా అభివర్ణించారు. దీర్ఘకాలిక వ్యయ చర్చలకు వీలుగా నవంబర్ చివరి వరకు నిధులను పొడిగించాలని రిపబ్లికన్లు ప్రతిపాదించారు. అదే సమయంలో డెమొక్రాట్లు ఆరోగ్య సంరక్షణ కోసం వందల బిలియన్ డాలర్ల నిధులను పునరుద్ధరించాలని అంటున్నారు. ఈ డిమాండ్లపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకుంటారని షుమెర్ అన్నారు. డెమొక్రాట్ల కొన్ని డిమాండ్లకు ట్రంప్ అంగీకరిస్తే షట్‌డౌన్‌ను నివారించవచ్చని ఆయన చెప్పారు. అయితే ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ డెమొక్రాట్లు “అమెరికన్ ప్రజలను బెదిరిస్తున్నారని” ఆరోపించారు. వాళ్లు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో, షట్‌డౌన్ దిశగా అడుగులు పెరుగుతున్నాయని అన్నారు.
ప్రజా ప్రతినిధుల సభ ఇప్పటికే స్వల్పకాలిక నిధులను పెంచే బిల్లును ఆమోదించింది. రిపబ్లికన్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఈ వారం సభ నిర్వహించినప్పుడు సభ్యులను వాషింగ్టన్‌కు పిలిపించి డెమొక్రాట్లపై ఒత్తిడి తేలేదనే విమర్శలు ఉన్నాయి. ఈసందర్భంగా జాన్సన్ మాట్లాడుతూ.. డెమొక్రాట్లు అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నారని ఆరోపించారు, వాళ్లు ప్రభుత్వాన్ని దించాలని నిర్ణయించుకుంటే, తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహిస్తారని చెప్పారు. ఖర్చు ప్రణాళికలపై అంగీకరించడానికి కాంగ్రెస్ తరచుగా ఇటువంటి గడువులను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ కోతలు, తొలగింపులపై డెమొక్రాట్లతో చర్చలు జరపడానికి రిపబ్లికన్లు నిరాకరించడంతో షట్ డౌన్ ముప్పు వచ్చింది. ఆ సమయంలో షుమెర్‌తో సహా 10 మంది డెమొక్రాటిక్ సెనేటర్లు, షట్‌డౌన్‌ను నివారించడానికి తాత్కాలిక రిపబ్లికన్ బిల్లుకు అనుకూలంగా అయిష్టంగానే ఓటు వేశారు. కానీ ఆ నిర్ణయం కారణంగా వారుని పార్టీ ఆగ్రహానికి గురిచేసింది. ఈ సమయంలో అలాంటి నాయకులను డెమొక్రాటిక్ సభ్యులు ట్రంప్‌కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలని డిమాండ్ చేస్తున్నారు.
READ ALSO: Tomahawk Missiles: రష్యా – ఉక్రెయిన్ పోరులో అమెరికా సూపర్ వెపన్.. మాస్కో భయానికి కారణం ఏంటి?
