NTV Telugu Site icon

US Election 2024: స్వింగ్ స్టేట్స్ లో ఆధిపత్యం కనపరుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Us Election 2024

Us Election 2024

US Election 2024 Swing States: తాజాగా జరిగిన అమెరికా ఎన్నికలలో భాగంగా అమెరికన్ల తలరాతను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్ లో ఎన్నికల ముందు తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉండేది. తాజాగా ఫలితాలు వెలబడుతున్న నేపథ్యంలో భాగంగా నిర్ణయాత్మకమైన స్వింగ్ స్టేట్స్ లో ఏడింటిలో ఏకంగా ఆరు రాష్ట్రాలలో రిపబ్లిక్ పార్టీ ఆధిక్యం కనపడిచింది. ఆరిజోనా మిర్చి ఖాన్ పెనస్లీవియా విస్కానిస్ జార్జియా నార్త్ కరోలినా రాష్ట్రాలలో రిపబ్లికాన్ పార్టీ ముందంజలో ఉంది. నవడాలో ఆదిత్యం అటు ఇటుగా దోపుచ్చులాడుతుంది. అరిజోనా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, నార్త్ కరోలినాలు ట్రంప్ కు ఆధిపత్యాన్ని ఇచ్చాయి.

Read Also: US Young Voters: డొనాల్డ్ ట్రంప్‌ వైపే యువ ఓటర్ల మొగ్గు..!

ఈ ఫలితాలను చూస్తుంటే.. ట్రంప్ విజయం దాదాపు ఖరారు గానే కనపడుతోంది. ఇకపోతే, సమాచారం మేరకు 230 స్థానాలలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కమలా హారిస్ 205 స్థానాలలో ముందంజలో ఉంది. ప్రస్తుతం స్వల్ప తేడాతో ఇద్దరు ప్రత్యర్థులు నువ్వా.. నేనా? అన్నట్లుగా పరిస్థితి కొనసాగుతుంది. పెన్సిల్వేనియాలో 77శాతం కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత.. మొదట్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఆధిక్యంలో ఉండగా.. ఆ కొద్దిసేపటికే రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ పుంజుకొని లీడింగ్ లోకి వచ్చారు. పెన్సిల్వేనియాలో విజయం సాధిస్తే డెమోక్రట్లకు 19 ఎలక్టోరల్‌ ఓట్లు లభించనున్నాయి.

Stock Markets India: అమెరికా ఎన్నికలో ట్రంప్ జోరు.. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్స్

జార్జియాలో 90శాతం పైగా కౌంటింగ్‌ పూర్తి కాగా.. కౌంటింగ్‌ మొదలుపెట్టినప్పటి నుండి ట్రంప్‌ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతూనే ఉన్నారు. మిచిగాన్ లో 35శాతం కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి ట్రంప్‌ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు నార్త్‌ కరోలినా రాష్ట్రంలో ట్రంప్‌ విజయం ఖాయమైపోయింది. ఆరిజోనాలో సంగం ఓట్లు లెక్కించే సమయానికి ట్రంప్ 3 వేలఓట్లతో ముందంజలో ఉన్నారు.