Site icon NTV Telugu

US Airstrikes Nigeria: క్రైస్తవ దేశంపై అమెరికా వైమానిక దాడులు.. ఇక వారికి చావే!

Us Airstrikes Nigeria

Us Airstrikes Nigeria

US Airstrikes Nigeria: అమెరికా త్వరలో నైజీరియాపై వైమానిక దాడులు ప్రారంభించవచ్చని సమాచారం. ఈ దేశంలో క్రైస్తవులను చంపుతున్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి తన మనస్సులో అనేక ప్రణాళికలు ఉన్నాయని ఇటీవల యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నైజీరియాలో క్రైస్తవ మతం ఉనికికి ముప్పును ఎదుర్కొంటుందని ట్రంప్ వెల్లడించారు. ఈ దేశంలో వేలాది మంది క్రైస్తవులను చంపుతున్నారు, ఈ సామూహిక హత్యకు రాడికల్ ఇస్లాంవాదులు బాధ్యత వహిస్తున్నారని ట్రంప్ స్పష్టం చేశారు. తర్వలోనే నైజీరియాలోని కొన్ని స్థావరాలపై వైమానిక దాడులు లేదా అమెరికా దళాలను పంపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

READ ALSO: Asaduddin Owaisi: ‘‘నా టోపీ, గడ్డాన్ని చూసి అలా పిలుస్తావా.?’’ తేజస్వీపై ఓవైసీ ఆగ్రహం..

ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు తిరిగి వెళుతూ ఆదివారం సాయంత్రం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని తన యుద్ధ విభాగాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు. నైజీరియాలో గ్రౌండ్ ఫోర్స్ లేదా వైమానిక దాడులను ఊహించుకుంటున్నారా అని ట్రంప్‌ను అడిగినప్పుడు.. దానికి ట్రంప్ ఇలా స్పందించారు.. “నా ఉద్దేశ్యంలో చాలా విషయాలు ఉన్నాయి, నేను చాలా విషయాలను ఊహించుకుంటున్నాను. వారు నైజీరియాలో క్రైస్తవులను రికార్డు సంఖ్యలో చంపుతున్నారు. అలా జరగడానికి మేము అనుమతించము” అని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో ట్రంప్ మాట్లాడుతూ.. నైజీరియాకు అమెరికా సహాయాన్ని నిలిపి వేస్తామని బెదిరించారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నైజీరియాకు రికార్డు ఉంది. ఈ దేశం క్రైస్తవ జనాభాను రక్షించడంలో విఫలమైతే అమెరికా సైనిక చర్య తీసుకోవచ్చని హెచ్చరించారు. దేశంలో చెలరేగిపోతున్న హింసకు “రాడికల్ ఇస్లామిక్ ” కారణమని ఆయన వెల్లడించారు. “నైజీరియాలో క్రైస్తవ మతం ఉనికికి ముప్పును ఎదుర్కొంటోంది” అని ఆయన చెప్పారు.

అమెరికా విదేశాంగ శాఖ “ప్రత్యేక ఆందోళన కలిగించే దేశాల” జాబితాలో నైజీరియాను చేర్చుతున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ జాబితాలో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని అమెరికా విశ్వసించే దేశాలు ఉన్నాయి. అమెరికా విడుదల చేసిన జాబితాలో నైజీరియాతో పాటు, చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్థాన్ కూడా ఉన్నాయి.

నైజీరియా స్పందన ఏంటంటే..
తమ దేశ ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తే, ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరాడటానికి అమెరికా సహాయాన్ని స్వాగతిస్తామని నైజీరియా ఆదివారం ఒక ప్రటకన విడుదల చేసింది. వాస్తవానికి నైజీరియాలో క్రైస్తవ – ముస్లిం వర్గాల మధ్య సంఘర్షణ 1950ల నాటిది. బోకో హరామ్ – ఫులానీ పశువుల కాపరులు వంటి సమూహాలు 2009 తర్వాత రాడికల్ ఇస్లామిక్ శక్తులకు లక్ష్యంగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. వారి ప్రాథమిక లక్ష్యాలు గ్రామీణ క్రైస్తవ గ్రామాలు, చర్చిలు అని అన్నారు. ఒక నివేదిక ప్రకారం.. 2009 నుంచి దేశంలో క్రైస్తవ వ్యతిరేక హింసలో దాదాపు 45 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, అలాగే వేలాది చర్చిలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.

దేశంలో ఇటీవల సంవత్సరాలలో క్రైస్తవులపై జరిగిన ప్రధాన దాడులు ఇవే..

మార్చి 2025: పలు నివేదికల ప్రకారం.. మే 24న ఫులాని పశువుల కాపరులు తారాబా రాష్ట్రంలో కరీం లామిడోపై దాడి చేసి 24 మంది యునైటెడ్ మెథడిస్టులతో సహా 42 మందిని చంపారు. ఈ దాడిలో వారు సుమారుగా 60 ఇళ్లను తగులబెట్టి, 5 వేల మందిని నిర్వాసితులను చేశారు.

జూన్ 2025: జూన్ 13-14 తేదీలలో బెన్యూ రాష్ట్రంలోని ఇలెవాటా గ్రామంలో ఫులాని పశువుల కాపరులు క్రైస్తవ గ్రామస్థులపై దాడి చేసి 100 మందికి పైగా మృతి చంపారు. ఈ దాడిలో డజన్ల కొద్దీ ఇళ్ళు దగ్ధమయ్యాయి.

సెప్టెంబర్ 2025: సెప్టెంబర్ 5న బోర్నో రాష్ట్రంలోని దారుల్ జమాల్ గ్రామంపై బోకో హరామ్ తెగలకు చెందిన వారు రాత్రిపూట జరిపిన దాడిలో సుమారుగా 63 మందికి పైగా మరణించారు.

సెప్టెంబర్ 2025: సెప్టెంబర్ 23 రాత్రి బోకో హరామ్ తెగకు చెందిన వారు అడమావా రాష్ట్రంలోని వాగ్గా మొంగోరో గ్రామంపై దాడి చేసి, నలుగురు క్రైస్తవులను చంపి, అనేక మందిని గాయపరిచారు. ఈ దాడిలో చర్చిలు, ఇళ్లను బూడిద చేశారు.

అక్టోబర్ 2025: అక్టోబర్ 14న ఫులాని తీవ్రవాదులు రాచస్, రావూరు గ్రామాలపై దాడి చేసి 13 మందిని చంపారు.

READ ALSO: Jaipur Accident: జైపూర్‌లో మృత్యు ఘోష.. 10 మంది మృతి.. 40 మందికి తీవ్ర గాయాలు

Exit mobile version