దేశ వ్యాప్తంగా ఎన్నికల మాట మోగిపోతుంది.. లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజయకీయ నాయకులతో పాటుగా, సినీ ప్రముఖులు కూడా రెడీ అవుతున్నారు.. వయసు అయిన నటులు రాజకీయాల్లోకి వెళతారు అని ఎవరో అన్నట్లు ఇప్పుడు సెలెబ్రేటీలు అదే పనిలో ఉన్నారు.. ఒక్కొక్కరు తమను నచ్చిన పార్టీలోకి చేరిపోతున్నారు.. నిన్న రాధికకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది.. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ ఎన్నికల్లో పాల్గొనబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా దీనిపై కీలక ప్రకటన చేసింది. తనకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వచ్చిందని తెలిపింది అమ్మడు.. అయితే ఏ పార్టీ నుంచి పోటి చెయ్యబోతుంది అనే విషయం మాత్రం చెప్పలేదు కానీ పోటీకి తాను సిద్ధంగా ఉందని చెప్పకనే చెప్పింది.. ఎన్నికల విషయం గురించి చెప్పిన ఊర్వశి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. నాకే టిక్కెట్ వచ్చింది. అయితే నేను పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. నేను పోటీ చేయాలా వద్దా అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి అని చెప్పుకొచ్చింది.. దీనిపై నెటిజన్స్ ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.. నిజంగానే ఈ అమ్మడు రాజకీయాల్లోకి వస్తుందా.. లేదా పబ్లిసిటీ కోసం ఇలా చెప్పిందా అనేది తెలియలేదు.. కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజులో వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది..