Site icon NTV Telugu

Urvashi Rautela : పంచవన్నెల రామచిలుకా.. కేన్స్ లో వాలిపోయింది ఇలా

Urvasi

Urvasi

బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ఈ ఏడాది కేన్స్ ఫిల్స్ ఫెస్టివల్ లో వేసుకున్న డ్రెస్సు వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది కేన్స్ రెడ్ కార్పెట్ పై ఇప్పటి వరకు నాలుగు సార్లు హొయలొలికించింది. మొదటి నుంచి అదిరిపోయే ఔట్‌ఫిట్స్‌తో ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మొదటి రోజు పింక్ కలర్ గౌను ధరించి మెడలో బంగారు మొసళ్ల నెక్‌లెస్‌ తో అదరగొట్టింది. ఆ తర్వాత వైట్ అండ్ బ్లూ కలర్ గౌను వేసుకుని బ్లూ కలర్ లిప్‌షేడ్‌తో దిమ్మతిరిగే లుక్స్ తో ఆకట్టుకుంది.

Also Read : UPSC CSE 2022: సివిల్స్ 2022 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు

తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో వెరైటీ లుక్‌లో కనిపించింది. క్లబ్ జీరో మూవీ ప్రీమియర్ కోసం కేన్స్ రెడ్ కార్పెట్ పై హొయలొలికించిన ఊర్వశి రౌటేలా.. గ్రీన్ కలర్ ఫీదర్ డ్రెస్సులో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈకలతో తయారు చేసిన ఈ డ్రెస్సులో ఊర్వశి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది.

Also Read : Mukesh Gowda: ‘గుప్పెడంత మనసు’ హీరో రిషి ఇంట తీవ్ర విషాదం

పూర్తిగా రెక్కలతో ఈ ఔట్ ఫిట్ ను డిజైన్ చేశారు. రెండు రెక్కలుగా కనిపించేలా ఈ డ్రెస్ ఉంది. గ్రీన్ కలర్ ఈకలతో అచ్చంగా ఫీనిక్స్ పక్షిలా ఊర్వశి రౌటేలా కనిపించింది. తలపై కూడా రెక్కల ఈకలతో తయారు చేసిన ఓ టోపీని కూడా పెట్టుకుంది. వెయిర్డ్ లుక్ లో వెరైటీగా కనిపించింది ఈ హాట్ బ్యూటీ. నెక్ ను న్యూడ్‌గా వదిలేసి.. చెవులకు డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. బోల్డ్ ఐ మేకప్ ప్లం లిప్ షేడ్, బ్లష్డ్ చీక్స్ తో మినిమల్ మేకప్ తో స్టైల్‌ను బాగా క్యారీ చేసింది. అయితే తన రెండు చేతులకు రింగ్స్ పెట్టుకుంది.

Also Read : Bengal : బెంగాల్‌లో 34 వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం.. 100 మంది అరెస్టు

కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త సినిమాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు. ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై తమ అందాలు ఆరబోస్తారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుంచి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.

Exit mobile version