Urvashi Rautela : పంచవన్నెల రామచిలుకా.. కేన్స్ లో వాలిపోయింది ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ఈ ఏడాది కేన్స్ ఫిల్స్ ఫెస్టివల్ లో వేసుకున్న డ్రెస్సు వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది కేన్స్ రెడ్ కార్పెట్ పై ఇప్పటి వరకు నాలుగు సార్లు హొయలొలికించింది. మొదటి నుంచి అదిరిపోయే ఔట్‌ఫిట్స్‌తో ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మొదటి రోజు పింక్ కలర్ గౌను ధరించి మెడలో బంగారు మొసళ్ల నెక్‌లెస్ తో అదరగొట్టింది. ఆ తర్వాత వైట్ అండ్ బ్లూ కలర్ గౌను వేసుకుని బ్లూ కలర్ లిప్‌షేడ్‌తో దిమ్మతిరిగే లుక్స్ తో ఆకట్టుకుంది.
Also Read : UPSC CSE 2022: సివిల్స్ 2022 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
Also Read
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో వెరైటీ లుక్‌లో కనిపించింది. క్లబ్ జీరో మూవీ ప్రీమియర్ కోసం కేన్స్ రెడ్ కార్పెట్ పై హొయలొలికించిన ఊర్వశి రౌటేలా.. గ్రీన్ కలర్ ఫీదర్ డ్రెస్సులో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈకలతో తయారు చేసిన ఈ డ్రెస్సులో ఊర్వశి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది.
Also Read : Mukesh Gowda: ‘గుప్పెడంత మనసు’ హీరో రిషి ఇంట తీవ్ర విషాదం
పూర్తిగా రెక్కలతో ఈ ఔట్ ఫిట్ ను డిజైన్ చేశారు. రెండు రెక్కలుగా కనిపించేలా ఈ డ్రెస్ ఉంది. గ్రీన్ కలర్ ఈకలతో అచ్చంగా ఫీనిక్స్ పక్షిలా ఊర్వశి రౌటేలా కనిపించింది. తలపై కూడా రెక్కల ఈకలతో తయారు చేసిన ఓ టోపీని కూడా పెట్టుకుంది. వెయిర్డ్ లుక్ లో వెరైటీగా కనిపించింది ఈ హాట్ బ్యూటీ. నెక్ ను న్యూడ్‌గా వదిలేసి.. చెవులకు డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. బోల్డ్ ఐ మేకప్ ప్లం లిప్ షేడ్, బ్లష్డ్ చీక్స్ తో మినిమల్ మేకప్ తో స్టైల్‌ను బాగా క్యారీ చేసింది. అయితే తన రెండు చేతులకు రింగ్స్ పెట్టుకుంది.
Also Read : Bengal : బెంగాల్‌లో 34 వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం.. 100 మంది అరెస్టు
కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త సినిమాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు. ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై తమ అందాలు ఆరబోస్తారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుంచి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
తాజావార్తలు
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!