NTV Telugu Site icon

Urfi Javed Tweet: ‘నన్ను క్షమించండి.. ఇక నుంచి బట్టలు వేసుకుంటా’

New Project (7)

New Project (7)

Urfi Javed Tweet: ‘బిగ్ బాస్ OTT’ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్‌కు ట్రెండింగ్ లో ఎలా ఉండాలో బాగా తెలుసు. ఉర్ఫీ తాను వేసుకున్న బోల్డ్ దుస్తులతో ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. కానీ ఉర్ఫీ మరోసారి వార్తల్లో నిలిచింది.. కానీ ఈసారి ఆమె ధరించిన దుస్తుల వల్ల కాదు. తాను చేసిన ఒక ట్వీట్ కారణంగా… ఆమె చేసిన ఈ ట్వీట్ యూజర్లను షాక్ కి గురి చేసింది.

Read Also: Inspiring Video : మానవత్వం చాటిన ఎస్సై.. వర్షంలో సిబ్బందితో కలిసి

ఉర్ఫీ జావేద్ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ ట్వీట్ తర్వాత ఉర్ఫీ అసామాన్య ఫ్యాషన్ ఇక స్వస్తి చెప్పబోతుందా అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. శుక్రవారం ఉర్ఫీ క్షమాపణ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ఇలా రాసుకొచ్చింది.. ‘నేను ధరించే దుస్తులు చాలామంది మనోభావాలను దెబ్బతీసింది. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఇప్పటి నుండి మీరు మారిన ఉర్ఫీని చూస్తారు. బట్టలు మార్చుకున్నాను’. ఈ ట్వీట్‌కి నెటిజన్లు విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు.

Read Also: Teeth : దంతక్షయానికి కారణాలెంటో తెలుసా ?

ఉర్ఫీ జావేద్ చేసిన ఈ ట్వీట్‌ను చాలా మంది నెటిజన్లు తమాషాగా తీసుకుంటున్నారు. ఉర్ఫీ ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఇలా చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల ఉర్ఫీ జావేద్ బ్రా లెస్‌గా తన శరీరానికి ఆకుపచ్చ తాళ్లను చుట్టుకుని కనిపించింది. దీనితో పాటు, ఉర్ఫీ స్కిన్ కలర్ లోదుస్తులపై ఆకుపచ్చ తాళ్లతో చేసిన ప్యాంట్‌లను ధరించింది. ఈ డ్రెస్ లో ఉర్ఫీ నిండు శరీరం స్పష్టంగా కనిపించింది.

Show comments