NTV Telugu Site icon

Urfi Javed : వెరైటీ డ్రెస్ తో ఆకట్టుకుంటున్న ఉర్ఫీ.. ఇదేం పిచ్చి పాప నీకు..

Urfi (2)

Urfi (2)

ఉర్ఫీ జావేద్.. ఈ పేరుకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అవుతారు.. వింత వింత డ్రెస్సులతో జనాలకు కోపం తెప్పిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు ఎదురైన తగ్గేదేలే అంటుంది.. రోజుకో వెరైటీ డ్రెస్సుతో జనాల్లోకి వస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా వెరైటీ డ్రెస్సులో ప్రత్యక్షం అయ్యింది.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

తాజాగా ఉర్ఫీ డ్రెస్సు అందరిని ఆకర్షిస్తుంది.. మొత్తం విశ్వాన్ని తన డ్రెస్సులో పెట్టేసి డిజైన్ చేయించుకొంది. సూర్యుడు చుట్టూ తిరిగి తొమ్మిది గ్రహాలను తన చుట్టూ తిప్పుకుంటూ ఉర్ఫీ ఆ డ్రెస్సుని రెడీ చేయించారు.. ఆ డ్రెస్సుతో ముంబై వీధుల్లోకి వచ్చేసింది.. ఆ డ్రెస్సులో ఆమెను చూసిన వార్తంతా సెల్ఫీలు దిగుతూ రోడ్డుపై హంగామా చేస్తున్నారు.. చాలా వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

ఈ డ్రెస్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉందని ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.. సైన్స్ ఎగ్జిబిషన్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉన్నప్పుడు ఈ డ్రెస్ బాగా అవసరం పడుతుంది అంటూ  కామెంట్స్ చేస్తున్నారు.. డ్రెస్సు సంగతి ఏమో గానీ ఉర్ఫీ మాత్రం చాలా అందంగా ఉందిని మరికొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికి మరోసారి ఉర్ఫీ తన వింత డ్రెస్సుతో వార్తల్లో హైలెట్ అవుతుంది.. ఒకసారి ఆ వింత డ్రెస్సును మీరు ఒక్కసారి చూసేయ్యండి..