Site icon NTV Telugu

Uorfi Javed : ఉఫ్… ఉర్ఫీ ఎంతపనైంది.. వారుకూడా రావద్దన్నారా!

Uorfi

Uorfi

Uorfi Javed : బిగ్ బాస్ షో తర్వాత ఉర్ఫీ జావేద్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఎక్కువ శాతం తన బోల్డ్ ప్యాషన్ తోనే పాపులర్ అయింది. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఉర్ఫీ జావేద్ ను ఎంత మంది అభిమానిస్తారో అంతే సంఖ్యలో విమర్శకులు కూడా ఉన్నారు. తను ఎప్పటికప్పుడు అభిమానుల కోసం ప్రత్యేకంగా బోల్డ్ ఫోటో షూట్‌లు చేస్తూ కనిపిస్తుంటుంది. కొద్ది రోజుల క్రితం ఉర్ఫీ జావేద్ చేతిలో బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ తో షర్ట్ లేకుండా ఫోటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది ఉర్ఫీ జావేద్‌పై విమర్శలు గుప్పించారు.

ఉర్ఫీ జావేద్ తన దుస్తుల కారణంగా గతంలో చాలాసార్లు చంపేస్తామని బెదిరింపులు అందుకుంది. అయితే ఆ బెదిరిపులు ఉర్ఫీ జావేద్‌పై అంతగా ప్రభావం చూపలేదు. ఉర్ఫీ జావేద్‌ తన దుస్తులపై ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటారు. తాజాగా ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఉర్ఫీ జావేద్ ఈ పోస్ట్‌లో చాలా పెద్ద వాదనే చేశారు. ఉర్ఫీ జావేద్ తాజా పోస్ట్ చూసి, అందరూ షాక్ అయ్యారు. తన దుస్తుల కారణంగా ముంబైలోని రెస్టారెంట్‌ తనను లోపలికి రానివ్వలేదని పేర్కొంది.

Read Also: California Senate : అమెరికాలో కుల వివక్ష నిషేధ బిల్లుకు కాలిఫోర్నియా ఆమోదం

సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ఉర్ఫీ జావేద్, “మీకు నేను నచ్చకపోతే, నన్ను పట్టించుకోకండి. ప్రస్తుతం 21వ శతాబ్దంలో బతుకుతున్నాం. దుస్తుల కారణంగా నన్ను రెస్టారెంట్లోకి అనుమతించలేదు. నిజంగా నేను ముంబైలోనే ఉన్నానా ? అనే ప్రశ్న నాలో తలెత్తుతోంది. మీకు నా ఫ్యాషన్ నచ్చకపోతే ఫర్వాలేదు…కానీ నన్ను అలా చూడటం తప్పు” . అంటూ ఈ కథనాన్ని ఉర్ఫీ జావేద్ నేరుగా జొమాటోకు ట్యాగ్ చేశారు. ఇప్పుడు నెటిజన్లు దీనిపై కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఉర్ఫీ జావేద్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు రెస్టారెంట్ సరైన నిర్ణయం తీసుకుందని చెప్పారు.

 

 

Exit mobile version