NTV Telugu Site icon

Lover Suicide: ప్రియుడి ఆత్మహత్య.. మనస్థాపంతో ఒంటికి నిప్పంటించుకుని..

Lover Suicide

Lover Suicide

Lover Suicide: ప్రేమించిన వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద వార్త తెలియ‌డంతో ప్రేమికురాలు తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైంది. ప్రేమికుడు లేని లోకంలో తానూ ఉండలేనని ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రేమికుడి ఆత్మహత్యతో కలత చెందిన 30 ఏళ్ల మహిళ తన గదిలో నిప్పంటించుకుని చనిపోయిందని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ విషాద ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌ సెక్టార్‌ 37లో చోటుచేసుకుంది.

ఆదివారం అర్థరాత్రి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమెను సివిల్ ఆసుపత్రికి తరలించగా, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందిందని సెక్టార్ 37 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ సునీత తెలిపారు.ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

Read Also: Mexico-US Border: మెక్సికో-యూఎస్ బోర్డర్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 39 మంది శరణార్ధుల మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన మంజు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ సెక్టార్ 37 ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు.ఆదివారం సాయంత్రం కిరాణా దుకాణం నిర్వాహకుడు బాబూలాల్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమెకు అతనితో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారని తెలిసింది. పెళ్లి చేసుకున్న ప్రేమికుడు బాబూలాల్‌ మృతి చెందాడన్న సమాచారం అందుకున్న మంజు ఆదివారం అర్థరాత్రి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

Show comments