యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సిస్టమ్ అనలిస్ట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ తో సహా వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. మంత్రిత్వ శాఖలు, జల్ శక్తి/జవహర్‌లాల్ నెహ్రూ రాజకీయ మహావిద్యాలయ, పోర్ట్ బ్లెయిర్, అండమాన్ & నికోబార్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర మంత్రిత్వ శాఖలతో సహా వివిధ మంత్రిత్వ శాఖలలో ఖాళీ ఉన్న ఉద్యోగాల ను భర్తీ చెయ్యనుంది..
అర్హతలు, ఆసక్తి కలిగిన కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పొందుపరిచ్చినట్లు విద్యార్హతలను కలిగి ఉండాలి.. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడాని కి చివరి తేదీ సెప్టెంబర్ 28, 2023. పూర్తి వివరాల కు వెబ్ సైట్ ; https://www.upsconline.nic.in పరిశీలించగలరు. దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29, 2023 గా నిర్ణయించారు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
అధికారిక వెబ్‌సైట్-upsconline.nic.in ని ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజీ లో వివిధ రిక్రూట్‌మెంట్ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ORA) లింక్ పై క్లిక్ చేయండి.
నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
అన్ని అవసరమై న పత్రాలను అప్ లోడ్ చేయండి.
ఆ తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను పూరించి సబ్ మిట్ చేయండి..
ఆ ఫామ్ ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసీ పెట్టుకోవాలి.. ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది..
