సివిల్స్ నోటిఫికేషన్ (UPSC Civil Notification) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఫిబ్రవరి 14న మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు upsconline.nic.inను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. బుధవారం నుంచి మార్చి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. దీంతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ ఇచ్చింది.
UPSC CSE నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫారమ్‌ను కూడా విడుదల చేసింది. దరఖాస్తు చేయడానికి ముందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి పొరపాటు జరగకూడదు. దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవడం అవసరమై ఉంటుంది. UPSC పరీక్షకు మూడు వారాల ముందు అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేస్తారు.
- నోటిఫికేషన్ వివరాలు ఇలా…
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంది.
ఓబీసి, ఇతర అభ్యర్థులకు రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు)
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు.
మెయిన్స్ పరీక్ష: ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి రూల్‌ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, వరంగల్
మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.