UPSC Civils 3rd Ranker Ananya Reddy on Virat Kohli: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే.. సొంతగా రెండేళ్లు కష్టపడి ఈ ఘనతను సాధించడం విశేషం. ప్రస్తుతం అనన్యపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అనన్య తన ప్రయాణం గురించి చెపుతూ.. తాను ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజుకు 12-14 గంటలు చదివానని చెప్పారు.
ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు తాను క్రికెట్ చూసేదాన్ని అని అనన్య రెడ్డి చెప్పారు. ‘పరీక్షల సమయంలో ఒత్తిడి సహజం. ఆ ఒత్తిడిని తగ్గించేందుకు అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచులు చూసేదాన్ని. యూపీఎస్సీకి సన్నద్ధం అవుతున్నా కాబట్టి సమయం ఉన్నపుడు మ్యాచ్ చూశాను. క్రికెట్‌తో పాటు నవలలు, పుస్తకాలు చదివా. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మాట్లాడడం కూడా ఒత్తిడిని తగ్గించింది. విరాట్ కోహ్లీ నా ఫెవరెట్ ప్లేయర్. ప్రతికూల సమయాల్లో కూడా రాణించే కోహ్లీ నాకు స్ఫూర్తి. ఫలితాలు ఎలా వచ్చినా.. మనం మాత్రం హార్డ్ వర్క్ చేయాలని విరాట్ నుంచి నేర్చుకున్నా’ అని అనన్య తెలిపారు.
Also Read: Rahul Gandhi: అమేథీ నుంచి పోటీ చేసేదెవరు.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
చిన్నతనం నుంచే సివిల్స్‌కు ప్రిపేర్ కావాలని తాను నిర్ణయించుకున్నానని, సమాజానికి సేవ చేయాలనే కోరిక తనకు ఉందని అనన్య రెడ్డి తెలిపారు. సివిల్స్‌లో మూడవ ర్యాంక్ సాధించడంతో తన కల నిజమైందని.. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సహకారం మరవలేనిదన్నారు. జాబ్ ఎక్కడొచ్చినా మంచి పరిపాలనను ప్రజలకు చేరువ చేస్తానని అనన్య రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రెండేళ్లు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయ్యారు.
