Site icon NTV Telugu

UPSC Centenary Celebrations: 100 ఏళ్లు పూర్తి చేసుకున్న “యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్”..

Upsc

Upsc

UPSC Centenary Celebrations: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ దినోత్సవం సమయానికే ఈ వేడుకలను రెండు రోజులపాటు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో యూపీఎస్సీ ప్రస్తుత ఛైర్మన్, సభ్యులు మాత్రమే కాకుండా, అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్మన్లు, సభ్యులు, మాజీ ఛైర్మన్లు, మాజీ సభ్యులు, సీనియర్ అధికారులు, నిపుణులు పాల్గొంటున్నారు. శతవార్షికోత్సవాల నేపథ్యంలో ఈ రెండుదినాల సమావేశాలు ఒక విధంగా దేశవ్యాప్తంగా నియామక వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకునే కీలక చర్యల్లో భాగంగా భావిస్తున్నారు.

READ MORE: CM Revanth Reddy: హైదరాబాద్ దేశంలోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్..

సామాన్య ప్రజలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇంకా సరళంగా, సులభంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండేందుకు ఏ విధమైన మార్పులు కావాలి అనే దానిపై లోతైన చర్చ జరగనుంది. పబ్లిక్ సేవలకు చేరాలనుకునే అభ్యర్థులకు మరింత న్యాయం జరిగేలా, వ్యవస్థ మరింత ఆధునికంగా ఉండేలా చేయడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యం. ఈ చింతన్ సమావేశాల్లో పాలనాపరమైన సేవలు, నైతికత, పారదర్శకత, సుపరిపాలన వంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నేటి యుగంలో టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు (AI) వంటి సాంకేతిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, పరీక్షా విధానాల్లో లేదా ఎంపికా ప్రక్రియల్లో వాటి ప్రభావం ఎంత ఉంటుంది అనే విషయాలు కూడా ఇందులో చర్చకు వస్తాయి.

READ MORE: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Exit mobile version