Site icon NTV Telugu

UPSC CDS 2 Final Result 2025: యూపీఎస్సీ సీడీఎస్ తుది ఫలితాలు విడుదల.. ఎంపికైన 302 మంది అభ్యర్థులు

Upsc

Upsc

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS 2) తుది ఫలితాలను ఈరోజు, మార్చి 30న ప్రకటించింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు upsc.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA), ఇండియన్ నేవల్ అకాడమీ (INA), ఎయిర్ ఫోర్స్ అకాడమీలతో సహా వివిధ రక్షణ అకాడమీలకు మొత్తం 302 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 190 మంది అభ్యర్థులు IMAకు, 85 మంది INAకు, 27 మంది ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అర్హత సాధించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version