Uppal Boy Murder Case Update: ఉప్పల్‌లో ఐదేళ్ల బాలుడు మనోజ్ పాండే హత్యకు గురయ్యాడు. కుటుంబానికి తెలిసిన కమర్ అనే వ్యక్తి బాలుడిని అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ నెల 12న బాలుడు కనిపించకుండా పోగా.. 15న రాత్రి మృతదేహం లభించింది. నిందితుడు కమర్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. బిస్కెట్ల ఆశ చూపించి తమ 5 ఏళ్ల అబ్బాయిని కమర్ అనే వ్యక్తి చంపేశాడని తెలిపారు. కమర్ పిల్లలతో రోజు ఆడుకునే వాడని, ఇంతటి దారుణానికి ఒడిగడతాడని తాము అసలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమర్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు.
Also Read: Neeraj Chopra Wife: రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్‌ను వదులుకున్న నీరజ్ సతీమణి.. ఎందుకో తెలుసా?
‘ఈ నెల 12 నా కొడుకు మోనోజ్ పాండే మిస్ అయ్యాడు. కొడుకు కనిపించకపోవడంతో ఉప్పల్ పోలీసులకి సమాచారం ఇచ్చాము. సీసీ ఫుటేజ్ ఆధారంగా నా కొడుకుని గుర్తించాము. నిన్న రాత్రి సమయంలో శవం అయి కనిపించాడు. ఘటన స్థలానికి వెళ్లి చూడగా నా కొడుకు మనోజ్ పండే విగత జీవిగా పడి ఉన్నాడు. కమర్ నా కొడుకుని చంపేశాడు. మాది ఛత్తీస్‌గఢ్, రెండు నెలల క్రితం రామంతపూర్ కేసీఆర్ నగర్ వచ్చాము. నాతో పాటు నిందితుడు కామర్ టింబర్ డిపో పనిచేస్తాడు. సీసీ ఫుటేజ్ చూసేంతవరకు కూడా మాకు కమర్‌పైన అనుమానం రాలేదు. కొడుకు అదృశ్యమైన రోజు నుంచి అతడు మాతో పాటే ఉన్నాడు. రెండు నెలల క్రితమే టింబర్ డిపోలో పనికి చేరాం. మాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. మా బాబుకి ఐదేళ్లు. మా ఒక్కగానొక్క కొడుకు లేకుండా పోయాడు. కమర్ మాతో కలిసి మెలిసి ఉండేవాడు. ఎక్కడ అనుమానం రాలేదు. పిల్లలతో రోజు ఆడుకునే వాడు. ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అసలు ఊహించలేదు. కమర్‌ను కఠినంగా శిక్షించాలి’ అని బాలుడి తండ్రి ఈశ్వర్ పాండే కన్నీరుమున్నీరు అయ్యాడు.
